తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు రామలింగయ్య కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాస్యనటుడు అల్లు రామలింగయ్య ప్రస్థానం ఎంతో మహా అద్భుతం అనే చెప్పాలి. ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న గొప్ప హాస్యనటుడు అల్లు రామలింగయ్య. అప్పట్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించిన అల్లు రామలింగయ్య ఎంతగానో  గుర్తింపు సంపాదించారు. తదనంతర కాలంలో అల్లు రామలింగయ్య వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు అల్లు అరవింద్. అల్లు రామలింగయ్య నటనలో ఎంతో గుర్తింపు సంపాదిస్తే... ఆయన వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన అల్లు అరవింద్ నిర్మాతగా ప్రస్థానాన్ని కొనసాగించారు.

 

 

 

 

 గీత ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించిన అల్లు అరవింద్ నిర్మాతగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని స్టార్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు అల్లు అరవింద్. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక పెద్ద ప్రొడ్యూసర్ గా పేరెన్నిక గన్నారు. ఇలా నిర్మాతగా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు అల్లు అరవింద్. ప్రస్తుతం గీత ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థ  ద్వారా కేవలం స్టార్ హీరోలతో సినిమాలు తీయడమే కాదు... కొత్త టాలెంట్ ను కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే వచ్చారు అల్లు అరవింద్.

 

 

 అయితే అల్లు అరవింద్ నిర్మాణ రంగంలో తనకు తిరుగు లేదు అని నిరూపించి తండ్రికి తగ్గ తనయుడిగా నిలదొక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం అల్లు అరవింద్ వారసుడిగా అల్లు అర్జున్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అల్లు అర్జున్ కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించుకుని  ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా కొనసాగుతున్నాడు. అయితే నిర్మాతగా నిలదొక్కుకున్న అల్లు అరవింద్ ఇటీవలే ఏకంగా ఆహా అనే ఓటిటీ సంస్థను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. సరికొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసేందుకు ఆహా అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు అల్లుఅరవింద్.

మరింత సమాచారం తెలుసుకోండి: