ఈ ప్రపంచంలో తండ్రి ,బిడ్డల సంబంధం ఒక అద్భుతమైన విడదీయని బంధం.. తన కొడుకు తన కన్నా గొప్ప స్థానంలో ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది తండ్రిని మించి ఇప్పుడు అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్నారు. ఆ తండ్రికి త‌గ్గ త‌న‌యుడు అనో లేదా తండ్రిని మించిన త‌న‌యుడో అనేలా చాలా మంది హవాను కొనసాగిస్తున్నారు. అయితే తండ్రి బ‌హుముఖ ప్రజ్ఞాశాలి అయిన‌ప్పుడు వార‌సుడు కూడా అదే తండ్రి వార‌స‌త్వాన్ని పుణికి పుచ్చుకుని తండ్రిలాగే అన్ని రంగాల్లో రాణించ‌డం నిజంగా గొప్ప విష‌యం. దివంగత నటుడు ఏఎన్నార్, నటనలో దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న ఘనత ఆయనకే దక్కింది.నటనలో ఆయనను మించిన రేంజులో అగ్ర హీరోగా టాలీవుడ్ లో  రాణిస్తున్నాడు అక్కినేని నాగార్జున.

 

 

 

అక్కినేని నాగేశ్వరరావు తెలుగు సినిమా రంగంలో చేసిన పాత్ర‌లు ఎప్ప‌ట‌కి చెక్కు చెద‌ర్లేదు. అందుకే ఆయన తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో ఓ దసరా బుల్లోడుగా, ఓ కృష్ణుడుగా కొలువైయ్యాడు. ఇక తండ్రి న‌ట వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని వ‌చ్చిన త‌న‌యుడు న‌ట‌ర‌త్న‌కు త‌గ్గ యువ‌ర‌త్న‌గా మారాడు. తెలుగు సినిమా రంగంలో ఇప్ప‌టి త‌రంలో దసరా బుల్లోడు పాత్రలు చేయాలన్న, చిలిపి పాత్రలు ఇలా ఏ పాత్ర‌లు చేయాల‌న్నా కూడా ఒక్క నాగార్జునకే సొంతం. అయితే ఏఎన్నార్ సినిమా రంగంల్లోకి వ‌చ్చి తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు. 


 

 

తండ్రి ఏఎన్నార్ దేవదాస్, దసరా బుల్లోడు ఇలా ఎన్నో రకాల పాత్రల్లో నటించి ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. అదే స్టైల్లో నాగార్జున మన్మథుడు గా  త‌న పేరుకు ముందు శాశ్వ‌తంగా ఉండేలా చేసుకున్నారు. రొమాంటిక్ పాత్రలను చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా వరుస హిట్ సినిమాలలో నటించడమే కాదు.. ఎన్నో పాత్రల్లో నటించి, అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు తన కొడుకు నాగ చైతన్య , అఖిల్ కూడా సినిమాలలో రాణిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: