తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్నటితరం మొదటి తరం సినీ ప్రముఖుల వారసులు  ఎంతోమంది హీరోలుగా కమెడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా  కొనసాగుతూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల వారసులే  ఎక్కువగా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సినీ ప్రముఖుల వారసులుగా కొనసాగుతున్న వారిలో ప్రస్తుతం నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రానా కూడా ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో రానా ఫ్యామిలీ ప్రస్థానం తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పటిది కాదు నిన్నటి మొన్నటి తరం నుంచి కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో రానా కుటుంబానికి చెందిన ప్రముఖులు తెలుగు  అందిస్తూనే ఉన్నారు.

 


 దగ్గుబాటి రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమలో నటుడిగా నిర్మాతగా ఎంతో  పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న విషయం తెలిసిందే. చిత్ర పరిశ్రమలోనే అత్యంత గొప్ప  పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్నారు దగ్గుబాటి రామానాయుడు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో  దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా దగ్గుబాటి సురేష్ విక్టరీ వెంకటేష్ రాణిస్తున్న విషయం తెలిసిందే. సురేష్ బాబు స్టార్ నిర్మాతగా కొనసాగుతుండగా... వెంకటేష్ ప్రస్తుతం స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వారసుడిగా... సురేష్ బాబు తనయుడు రానా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన విషయం తెలిసిందే. 

 


 హీరోగా ఎంతగానో గుర్తింపు సంపాదించారు రానా. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించడంతో పాటు... తనలోని విలనిజాన్ని కూడా చూపిస్తూ ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాడు. అంతే కాకుండా ఏదైనా ఒక వైవిధ్యమైన పాత్ర వస్తే రానా నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో  రానా  ఒక నటుడిగా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు అని చెప్పాలి. రానా ఏదైనా పాత్ర పోషిస్తున్నాడు అంటే అందులో నట విశ్వరూపం ఉండటం ఖాయం అని తెలుగు ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా అది ఎంతో వైవిధ్యమైన పాత్ర అని అందరూ అర్థం చేసుకుంటారు. ఇలా తాత తండ్రికి తగ్గ వారసుడిగా అద్భుతంగా నిలదొక్కుకున్నాడు రానా.

మరింత సమాచారం తెలుసుకోండి: