టాలీవుడ్ లో ఉన్న వెర్సటైల్ యాక్టర్స్ లో హీరో నితిన్ స్టైలే వేరు. హీరోగా తెరంగేట్రం చేసి 20ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ హీరో.. హిట్లు, ఫ్లాపులకు అతీతంగా కెరీర్ కొనసాగిస్తున్నాడు. ఏ హీరోకైనా వరుసగా డజను సినిమాలు ఫ్లాప్ అయితే ఇక ఆ హీరో కెరీర్ అయిపోయినట్టే. కానీ.. వీటన్నింటికీ తట్టుకుని నిలబడిన హీరో నితిన్. రీసెంట్ గా భీష్మతో సూపర్ హిట్ కొట్టిన నితిన్ పలు ప్రాజెక్టులు లైన్ లో పెట్టాడు. మేర్లపాక మురళి దర్శకత్వంలో ఓ సినిమా.. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ సినిమాలు చేస్తున్నాడు.

IHG

 

ఇది కాకుండా కృష్ణ చైతన్య డైరక్షన్ లో పవర్ పేట అనే సినిమా చేస్తున్నాడని ఆమధ్య వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో నితిన్ మూడు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఈ మూడు పాత్రలకు సంబంధించి మేకోవర్ కూడా డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఏజ్ గ్యాప్ కు సంబంధించి నితిన్ వివిధ మేకేవర్స్ లో కనిపస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో బాగా రౌండ్ అవుతోంది. ఈ సినిమాలో నితిన్ మాస్ గెటప్ లో కూడా కనిపిస్తాడని అంటున్నారు.

IHG's look in Bheeshma's singles anthem | <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=NITHIN' target='_blank' title='nithin- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>nithin</a> ...

 

ప్రస్తుతం గాసిప్ గా ఉన్న ఈ వార్తపై అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సిందే. భీష్మ హిట్ తో జోష్ లో ఉన్న నితిన్ కరోనా పరిస్థితులకు ముందు మేర్లాపాక మురళితో ఓ సినిమా కన్ఫర్మ్ చేశాడు. పూజా కార్యక్రమం కూడా జరిగిన ఆ సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ సినిమా తర్వాతనే పవర్ పేట ఉంటుందని అంటున్నారు. మరి.. ఈ వార్తలపై అఫిషియల్ న్యూస్ తెలియాల్సి ఉంది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: