టాలీవుడ్ లో రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతని సినిమాలు అతని నటన గురించి అందరికి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ వాటిని నిర్మిస్తూ తండ్రికి తగ్గ తనయుడి గా అతను నిలబడుతున్నాడు. అతని సినిమాలకు మంచి ఆదరణ వస్తుంది. ఇక ఇదిలా ఉంటే అతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటీ అంటే... తండ్రికి మించిన విజేతగా అతను సినిమాల్లో నిలబడకపోయినా సరే అతను మాత్రం కచ్చితంగా తన మార్క్ ని చూపించాడు అనే చెప్పాలి. 

 

చిరంజీవి ఇంత దూకుడు గా సినిమాలను నిర్మించే వారు కాదు. ఆయన ఎప్పుడో ఒక సినిమాకు నిర్మాతగా వ్యవహరించడానికి ఆలోచించే వారు. కాని రామ్ చరణ్ మాత్రం అలా లేదు అనే చెప్పాలి. వరుసగా సినిమాలను నిర్మిస్తూ అది కూడా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అనే చెప్పాలి. అతని సినిమాలకు మంచి స్పందన వస్తుంది. అగ్ర నిర్మాతలు కూడా భయపడుతున్న తరుణంలో అతను మాత్రం చాలా స్వేచ్చగా సినిమాలను నిర్మిస్తున్నాడు అని చెప్పవచ్చు. 

 

తండ్రి తో ఖైదీ నెంబర్ వన్ సినిమాను నిర్మించిన అతను ఇప్పుడు ఆచార్య సినిమాను  నిర్మిస్తున్నాడు. అయితే సైరా సినిమా విషయంలో మాత్రం అతనికి షాక్ తగిలింది అని చెప్పాలి. ఆ తర్వాత కాస్త జాగ్రత్త  పడినట్టు కనపడినా సరే అక్కడి నుంచి మాత్రం చాలా దూకుడుగా సినిమాలు చేస్తున్నాడు అనే చెప్పాలి. ఇప్పుడు అతను రెండు సినిమాలు చేస్తున్నాడు నిర్మాతగా. రీమేక్ సినిమాలను కూడా కొనే ఆలోచనలో ఉన్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో టాలీవుడ్ లో జరుగుతుంది. అక్కడ సూపర్ హిట్ అయిన సినిమాల మీద అతను ఫోకస్ చేసాడు అని టాలీవుడ్ లో ఉంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో...

మరింత సమాచారం తెలుసుకోండి: