టాలీవుడ్ లో మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమాలు మహేష్ నటన గురించి టాలీవుడ్ లో మంచి టాక్ ఉంది. ఇక అతను తండ్రి వారసత్వాన్ని నటన పరంగా నిలబెట్టాడా లేదా అనే దాని మీద అనేక సందేహాలు ఉన్నాయి. వాస్తవానికి కృష్ణ లో సాహసం ఎక్కువ. కాని మహేష్ లో సాహసం అనేది తక్కువ అని అంటారు టాలీవుడ్ జనాలు. అతను ఆత్మ రక్షణ అనే ధోరణి లో సినిమాలు చేస్తాడు అని అంటారు. నిర్మాతగా కూడా స్వేచ్చగా పెట్టుబడి పెట్టే విధంగా ఉండదు అని చాలా ఆలోచించి ఒక సినిమాకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది అని అంటారు. 

 

అతని సినిమాలు చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. గతంలో కృష్ణ సాహసాలు ఎక్కువగా చేసే వారు. కాని మహేష్ మాత్రం సాహసం చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉండదు. ఇక నటన విషయంలో మాత్రం మహేష్ తండ్రికి తగ్గ  తనయుడు అనిపించుకున్నాడు. అయితే తండ్రి మాదిరిగా భిన్న పాత్రల్లో అతను చేయలేడు అని అంటారు. కృష్ణ ఏ పాత్రలో అయినా సరే తన ప్రతిభ ను అన్ని విధాలుగా కూడా  చూపించారు. కాని మహేష్  మాత్రం తన గ్లామర్ కి ఇబ్బంది లేకుండా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు అని టాలీవుడ్ జనాలు అంటారు. 

 

అతని తో నిర్మాతలు అందుకే ఒకటికి పది సార్లు అలోచించి సినిమాలు చేస్తారు అనేది టాలీవుడ్ జనాల మాట. ఇక ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: