మన తెలుగులో కొందరు స్టార్ హీరోలు తండ్రి వారసత్వాన్ని నిలబెట్టే విషయంలో కాస్త వెనకబడే ఉంటారు. అందులో నందమూరి బాలకృష్ణ ఒకరు. తండ్రి తరహాలో భిన్న పాత్రల్లో బాలయ్య కనపడినా సరే ఆయన మాత్రం చాలా వరకు సక్సెస్ కాలేదు అనే చెప్పాలి. తండ్రి స్థాయిలో నటించాలి అనే కోరిక తో బాలయ్య కాస్త వెనకబడ్డారు అనేది వాస్తవం. ఇక తండ్రి స్థాయిలో సినిమాల నిర్మాణం గాని దర్శకత్వం గాని బాలయ్య చేయలేదు అనేది వాస్తవం. దానికి కారణం బాలయ్య కాస్త భయపడటమే. సినిమాలను నిర్మించే విషయంలో ఎన్టీఆర్ ముందు ఉండే వారు. 

 

ఇక ఆయన దర్శకుడి గా కూడా చాలా సినిమాలు చేసారు. కాని బాలయ్య మాత్రం ఆ విషయంలో  చాలా వరకు ఎన్టీఆర్ స్థాయిని అందుకోలేదు అనే చెప్పాలి. దానికి కారణం ఏంటీ అంటే బాలయ్య లో కాస్త ఆత్మరక్షణ ధోరణి ఎక్కువ అంటారు. నష్టం వస్తుంది అంటే ఆయన వెనక్కు తగ్గే అవకాశం ఉంది. నిర్మాతగా ఆయన తండ్రి బయోపిక్ సినిమా తో అడుగు పెట్టారు గాని స్వేచ్చగా ఆ సినిమాను ఆయన నిర్మించలేదు. ఆ సినిమాకు పెట్టుబడి పెట్టడానికి బాలయ్య ఒకటికి పది సార్లు ఆలోచించారు అని అంటారు. 

 

ఇక అది అలా ఉంటే ఆ సినిమా తర్వాత బాలయ్య కొన్ని సినిమాలను నిర్మిస్తారు అని భావించినా సరే ఆయన మాత్రం కాస్త భయపడుతూ వస్తున్నారు. చివరికి తన కొడుకు తో కూడా ఆయన సినిమా చేయడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. మరి కొడుకుతో ఆయనే  నిర్మాతగా సినిమా వస్తుంది అనే టాక్ వినపడుతుంది. మరి ఎప్పుడు సినిమా వస్తుంది అనేది చూడాలి. ఇప్పుడు బాలయ్య రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఒకటి వచ్చే ఏడాది విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: