ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరూ అంతర్జాతీయ యోగ దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా  యోగ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంతో మంది పలు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు. ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు సైతం అంతర్జాతీయ యోగా దినోత్సవం పై స్పందిస్తూ.. ప్రతి రోజు యోగా క్రమం తప్పకుండా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు... యోగ ఆవశ్యకత గురించి తెలియజేస్తున్నారు. ఇక ఎంతో మంది ప్రముఖులు యోగాసనాలు వేసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు, 

 

 ఇలా ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం యోగా దినోత్సవ శుభాకాంక్షలతో నిండిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు యోగ దినోత్సవం సందర్భంగా తమ అభిమానులు అందరికి కూడా యోగ డే విషెస్ చెబుతున్నారు. అంతే కాకుండా యోగా గురించి పలు సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు ప్రముఖులు. తాజాగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పై టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. తన అభిమానులందరికీ యోగ డే శుభాకాంక్షలు తెలిపారు మంచూ  మోహన్ బాబు. అంతేకాకుండా యోగా డే సందర్భంగా పూర్వీకులను గుర్తు చేసుకున్నారు మోహన్ బాబు. 

 


 మన పూర్వీకులు ఈ ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతియోగా అంటూ చెప్పుకొచ్చారు ఆయన. అందుకే మనం రోజు యోగా ప్రాక్టీస్ చేయాలి అంటూ తెలిపారు. అంతేకాకుండా యోగ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా తెలిపారు నటుడు మంచు మోహన్ బాబు. యోగ వల్ల ఆరోగ్యంగా ఉండడంతోపాటు మనసుకు శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది అంటూ ఆయన తెలిపారు. యోగా చేయడం కారణంగా ఎప్పుడూ ఫ్రెష్ గా  ఉంటామని తెలిపారు. ఇక అంతే కాకుండా మరికొంత మంది సినీ ప్రముఖులు కూడా యోగా దినోత్సవం పై స్పందిస్తూ అందరికీ యోగ డే ఆవశ్యకతను తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: