ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో  ఎంతో మంది ప్రముఖులు యోగ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతున్నారు, యోగా చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు యోగ దినోత్సవం సందర్భంగా యోగ యొక్క ఆవశ్యకతను తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు గారాలపట్టి సితార యోగ డే సందర్భంగా చేసిన సులువైన యోగాసనాలు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. 

 


 మహేష్ బాబు గారాల పట్టి సితార ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు సితార కు ఒక ప్రత్యేకమైన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. యూట్యూబ్ ఛానల్  ద్వారా పలు ఆసక్తికర వీడియోలను ఎప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటుంది సితార.  తాజాగా ఆధ్యా సీతార లు  యోగ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తమ ఏ అండ్ ఎస్ యూట్యూబ్ ఛానల్ లో కొన్ని ఆసక్తికర యోగాసనాలను అప్లోడ్ చేశారు ఈ ఇద్దరు. సునాయాసంగా చేసే యోగాసనాలతో పాటు ఆసనాలతో కలిగే లాభాలను కూడా చక్కగా వివరించారు. ఇక ఈ వీడియో  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.నెటిజన్లను  బాగా ఆకర్షించింది ఈ వీడియో. 

 


 కాగా మహేష్ బాబు కూతురు సితార దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య  ఇద్దరు మంచి స్నేహితులు అనే విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి ఏ అండ్ ఎస్  అనే యూట్యూబ్ ఛానల్ ని ప్రారంభించారు కూడా. ఆటలు వినోదం విజ్ఞానానికి సంబంధించిన పలు వీడియోలు ఎప్పుడూ తమ యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ నెటిజన్లను ఎప్పటికప్పుడు అలరిస్తూ ఉంటారు. ఇక ఈ చిన్నారుల యూట్యూబ్ ఛానల్ కి రోజురోజుకు అభిమానుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ఇక వీడియోలకు వ్యూస్  కూడా రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: