తెలుగు సినిమాల్లో చిరంజీవి గురించి ఒక మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ‘చిరంజీవి గారు కష్టపడి పైకొచ్చారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని సినిమాల్లోకి వచ్చాం. ఆయనతో ఒక్కసారైనా నటించాలి.. ఆయనతో సినిమా చేయాలి’ అంటూ ఎంతోమంది చెప్తూ ఉంటారు. చిరంజీవి ప్రభావం తెలుగులో అంతగా ఉందనేది నిజం. ఎందరో ఔత్సాహికులు చిరంజీవితో ఒక్క సినిమాలో అయినా నటించాలని కోరుకుంటారు. టాలీవుడ్ టాప్ యాంకర్ శ్రీముఖి కూడా ఇదే కోరుకుంటోంది. తన రీసెంట్ గా ఓ మీడియా ఇంటరాక్షన్ లో ఇదే అభిప్రాయాన్ని వెలుబుచ్చింది.

IHG's Acharya Suffers From ...

 

టాలీవుడ్ లో ఎవరితో సినిమా చేయాలని ఉంది అనే ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పుకొచ్చింది. ‘నాకు చిరంజీవి గారి సినిమాలో నటించాలని ఆశ. నాకు ఊహ తెలిసే సరికి మా ఇంట్లో అమ్మా, నాన్న చిరంజీవి గారికి వీరాభిమానులు. వారి ప్రభావంతో నేను చిరంజీవి గారి సినిమాలు చాలా చూశాను. దీంతో నేను కూడా చిరంజీవి గారికి అభిమాని అయిపోయాను. నేను సినిమాల్లోకి వచ్చే సమయానికి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన సినిమాలు చేస్తున్నారు. దీంతో ఆయన సినిమాలో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను’ అని చిరంజీవిపై తన ఇష్టాన్ని చెప్పుకొచ్చింది.

IHG

 

శ్రీముఖి కంటెస్టెంట్ గా చేసిన బిగ్ బాస్ సీజన్3 ఫైనల్ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. ఆ ఫైనల్ లో శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. దాంతో ఆమె విష్ కొంత మేర నెరవేరింది. కానీ.. సినిమాలో ఆయనతో నటించడమే ముఖ్యం. ప్రస్తుతం చిరంజీవి చేస్తున్న ఆచార్యలో అవకాశం కష్టమే. కాబట్టి.. చిరంజీవి తర్వాతి ప్రాజెక్టుల్లో అయినా శ్రీముఖి కోరిక నెరవేరుతుందేమో చూద్దాం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: