కరోనా లాక్ డౌన్ దెబ్బకు సినిమా థియేటర్లు ఎప్పుడు ఓపెన్ అవుతాయి అన్న దాని విషయంలో అటు కేంద్ర ప్రభుత్వం గాని ఇటు సినిమా వర్గాలు గాని చెప్పలేక పోతున్నాయి. దీంతో లాక్ డౌన్ టైం నుండి సినిమా ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు బాగా OTT కి అలవాటు పడటం జరిగింది. మరో పక్క సినిమాలన్నీ నిర్మించి రిలీజ్ చేద్దాం అని భావిస్తున్న నిర్మాతలు థియేటర్లు ఓపెన్ అయ్యే అవకాశం లేకపోవడం తో OTT నే నమ్ముకుని సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా OTT ప్లాట్ ఫామ్ పై  తక్కువ లాభం వచ్చినా సినిమా ఫ్లాప్ అయితే ఎలాంటి నష్టాలు చూడాల్సి వస్తుందో అన్న భ‌యం ఉన్న‌వాళ్లు సైతం ఓటీటీకి జై కొడుతున్నారు.

 

దీంతో ప్రేక్షకులకు బోర్ కొట్టించే సినిమాలు అటువంటి కంటెంట్ కలిగిన సినిమాలు ఓటిటి లో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో వ‌రుస‌గా ఫ్లాప్ సినిమాలే దర్శనమిస్తున్న తరుణంలో ప్రేక్షకులు అనవసరంగా సినిమా చూశామన్న భావనతో ఉంటున్నారట. చెత్త సినిమాలన్నీ OTTలో పడేస్తున్నారు అంటూ నిర్మాతలపై మండిపడుతున్నరు. ఇప్పటివరకు 10 సినిమాలు రిలీజ్ అయిన వాటిలో ఒకటి అంటే ఒకటి కూడా థియేటర్లో చూసి ఉంటే బాగుండేది అని అనుకున్నా ఫీలింగ్ ఒక్క సినిమాపై కూడా రాలేదు.

 

ఏ భాష అయినా హిందీ అయినా తమిళ మైన తెలుగు అయినా ఇప్పటివరకు ఓటిటి లో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ అట్టర్ ఫ్లాప్ అవడంతో ఓటిటి ఫ్లాప్ సినిమాల ఫ్లాట్ ఫామ్ అనే ముద్ర ప్రేక్షకుల మైండ్ లో పడిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సినిమా వ్యాపారంపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని సినిమా విశ్లేషకులు అంటున్నారు. మరో పక్క సినిమా ధియేటర్ లు ఓపెన్ అవటానికి ఇంకా నాలుగు నెలలు టైం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: