నందమూరి బాలకృష్ణ తన సినిమాలతో టాలీవుడ్ లో ఎన్నో రికార్డులు సృష్టిస్తూ వుంటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు తన నటనతో ఎంతో మంది ప్రేక్షకులను అలరించి తనదైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. అయితే కేవలం సినిమాలలోనే కాదు తాజాగా తన జన్మదిన వేడుకల తో కూడా రికార్డులు బద్దలు కొట్టాడు నందమూరి బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ బర్త్ డే అంటే నందమూరి అభిమానులు అందరికీ ఫుల్ జోష్ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి సంవత్సరం వేలాది మంది అభిమానుల సమక్షంలో నందమూరి బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. 

 


 అయితే ప్రస్తుతం కరోనా  సమయం కావడంతో గ్రాండ్ సెలబ్రేషన్స్ కి  నందమూరి బాలకృష్ణ దూరంగానే ఉన్నారు. ఎంతో సింపుల్ గా తన జన్మదిన వేడుకలను జరుపుకున్నారు నందమూరి బాలకృష్ణ. ఇక బాలకృష్ణ పుట్టిన రోజు నాడు అభిమానులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు అని చెప్పాలి. నందమూరి బాలకృష్ణ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే గ్లోబల్ నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో... కరోనా  ఫ్రంట్లైన్ వారియర్స్ అయిన పోలీసులు వైద్య సిబ్బంది పారిశుధ్య సిబ్బంది  చేస్తున్న కృషికి సెల్యూట్ చేస్తూ ఏకకాలంలో ఏకంగా  ప్రపంచవ్యాప్తంగా దాదాపు
 21 వేలకు పైగా కేకులను కట్ చేశారు.

 


 ఇలా ఎవరికి వారు కరోనా  వైరస్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటిస్తూ... మిత్రులు స్నేహితులు సన్నిహితులు అభిమానులు ఇలా ఎవరికి వారు తమ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో కలిసి కేకులు కట్ చేశారు. అయితే ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం తో రికార్డులు బద్దలయ్యాయి అనే చెప్పాలి. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు... దీనిని పర్యవేక్షించి ఇది ప్రపంచ రికార్డుగా ప్రకటించారు. ఇక ప్రస్తుతం కరోనా వైరస్ క్రైసిస్ ఉండటం కారణంగా ఎలాంటి అవార్డులు ఇవ్వ లేకపోయినప్పటికీ ఈ పరిస్థితి కాస్త తగ్గగానే ఈ సంస్థలకు చెందిన ప్రతినిధులు బాలకృష్ణ కు ఈ రికార్డ్ లకు  సంబంధించిన పత్రాలను అందజేయనున్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన బాలకృష్ణ మీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకుని సామాజిక దూరాన్ని పాటిస్తూ నా బర్త్ డే కి అపూర్వ కానుక ఇచ్చారు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: