తెలుగు చిత్ర పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ మధ్య కాలంలో అయితే తమన్ అందించిన సంగీతం తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుంది అన్న విషయం తెలిసిందే. తమన్ అందించిన మెలోడీ సాంగులు అద్భుతమైన మ్యూజిక్ తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేస్తోంది. అయితే ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా ఎంతో మంది సినీ ప్రముఖులు తమ తండ్రుల తో తమకున్న అనుబంధాన్ని గురించి... జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే.

 


 అంతే కాకుండా ఇదే  రోజు మ్యూజిక్ డే కావడంతో కూడా పలువురు సంగీత దర్శకులు  తమ  అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన గురువు మని  శర్మ గురించి మాట్లాడుతూ తన అభిమానాన్ని వెల్లడించారు. ఇప్పటికే పలు సందర్భాల్లో గురువు మణిశర్మ  గురించి ఎంతో గొప్పగా మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రపంచంలో నా పని మీద నమ్మకం ఉంది మా నాన్నగారికి మాత్రమే. నేను డ్రమ్మర్  అవుతానని చిన్న వయసులోనే మా నాన్న నమ్మే  వారు. కానీ నేను చిన్నతనంలోనే మా నాన్నను కోల్పోయాను. కానీ మా నాన్న లేని లోటు తీర్చింది  మాత్రం మణి శర్మ గారు. 

 

 తొమ్మిదేళ్లపాటు మణి శర్మ గారితో తన పని చేశానని.. అప్పుడు నాకు ఆయన ఇచ్చిన అనుభవమే ప్రస్తుతం నా  వృత్తిగా మారింది అంటూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చెప్పుకొచ్చారు,.మణి శర్మ గారు లేకుండా నేను లేనని ఆయన పేరు నిలబెట్టడం నా బాధ్యత... నా హార్డ్ వర్క్ మొత్తం ఆయనకే అంకితం చేస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టు పెట్టారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. ఆయన  లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండే వాడిని కాదు అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: