వర్షాలు ఎక్కువ పడితే అతివృష్టి.. తక్కువ పడితే అనావృష్టి అంటాం. సినిమా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాతావరణమే క్రియేట్ అయింది. వర్షాలతో సినిమాలకు సంబంధం లేకపోయినా.. కరోనా మాత్రం టాలీవుడ్ లో ఇలాంటి వాతావరణమే సృష్టించింది. సినిమాలు రిలీజ్ కాక.. ప్రస్తుతం అనావృష్టితో ఉన్న సినిమా ఇండస్ట్రీ సమ్మర్ లో అతివృష్టిని ఎదుర్కొంటోంది. 

 

కరోనా ఎఫెక్ట్ ఏముంది.. ? రెండు మూడు నెలల్లో అంతా సర్దుకుంటుంది అనుకుందనుకున్నారు. తీరా చూస్తే.. మూడు నెలలు గడిచినా.. ఏ మాత్రం కుదుటపడలేదు కదా.. కంటి చూపుతో భయపెడుతోంది. సినిమా ఇండస్ట్రీ తీవ్ర ప్రభావానికి గురయింది. సమ్మర్ అంతా కరోనాకే అంకితమయిపోయింది. పోనీ.. దసరా నాటికి కోలుకుంటుందనుకుంటే ఆ దాఖలాలు అస్సలు కనిపించడం లేదు. ఎందుకంటే షూటింగ్స్ కు తెలుగు ప్రభుత్వాలు అనుమతించినా.. కరోనా భయంతో పెద్ద హీరోలే కాదు.. చిన్న సినిమాలు సైతం ముందడుగు వేయలేకపోతున్నారు. 

 

షూటింగ్స్ కు పర్మీషన్ ఇచ్చినా.. కెమెరా ముందుకు రావడానికి నటీనటులు ఎవ్వరూ సాహసించలేకపోతున్నారు. మధ్యలో ఆగిపోయిని ట్రిపుల్ ఆర్.. చిరంజీవి ఆచార్య.. బాలకృష్ణ మోనార్క్.. వెంకటేశ్ నారప్ప.. ఇలా ఒక్క సినిమా షూటింగ్ కూడా మొదలు కాలేదు. ఈ లెక్కన దసరాకు వద్దామనుకున్న ఆచార్య ఇక రానట్టే లెక్క. 

 

కరోనా విజృంభించడంతో పెద్ద హీరోలే కాదు.. యంగ్ హీరోలకు కూడా భయపడిపోతున్నారు. రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తై మూవీ చే్స్తున్నాడు. పేట.. దర్బార్ మాదిరి అన్నాత్తైను కూడా సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకుంటే.. కరోనా బ్రేకులేసింది. సినిమా పూర్తి కావాలంటే.. ఇంకా ఆరు నెలలు షూటింగ్ చేయాల్సి ఉంది. సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేకపోతున్నారు. దీంతో సంక్రాంతికి రావాల్సిన సూపర్ స్టార్ 2021 సమ్మర్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. 

 

తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. 2021సమ్మర్ నాటికి ఈ అనావృష్టి.. అతివృష్టిగా మారబోతోంది. షూటింగ్స్ పూర్తి కాక రిలీజ్ కు నోచుకోని సిినిమాలన్నీ.. మూకుమ్మడిగా సమ్మర్ పై కన్నేశాయి. ప్రభాస్.. ఎన్టీఆర్.. చిరంజీవి.. ఒకరేంటి పెద్ద హీరోల సినిమాలన్నీ ఒకేసారి వచ్చి బిగ్ ఫైట్ కు తెరలేపుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: