నభా నటేష్ నన్ను దోచుకుందువటే అనే తెలుగు మూవీతో ఎంట్రీ ఇచ్చి యూత్ గుండెలు కొల్లగొట్టింది. అందంతో పాటు అన్నీ నిండుగా ఉన్న నభా నభూతో నభవిష్యత్ అన్నట్లుగా తన సొగసులతో సెగ పుట్టించేస్తోంది. ఆమె ఇస్మార్ట్ శంకర్ మూవీలో రెచ్చిపోయి చేసిన దానికి ఇప్పటికి ఇన్నాళ్ళకు  ప్రతిఫలం దక్కింది.

IHG

ఆమె కోరిక చాన్నాళ్ళకు తీరబోతోంది. ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం తలుపు తట్టి మరీ వచ్చింది. జూనియర్ ఎన్టీయార్ మూవీలో ఆమె ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయిందని టాక్ టాలీవుడ్లో నడుస్తోంది. అయినను పోవలె హస్తినకు అన్న వర్కింగ్ టైటిల్ తో ఎన్టీయార్, త్రివిక్రం కాంబోలో వస్తున్న సినిమాలో నభా నటేష్  బంపర్ ఆఫర్ కొట్టేసింది.

IHG

ఈ మూవీలో మరో హీరోయిన్ని బాలీవుడ్ నుంచి తెస్తారని అంటున్నారు. మరి నభకు సెకండ్ హీరోయిన్ పాత్ర ఉంటుందని అంటున్నారు. అయితే ఎన్టీయార్ వంటి బిగ్ స్టార్ తో మూవీ కాబట్టి ఎలివేట్ అవడం ఖాయమని నభా ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి నభా చేతిలో ఇపుడు రెండు సినిమాలు ఉన్నాయి. కానీ అవన్నీ మిడిల్ రేంజి హీరోలవే. ఒక్కసారిగా స్టార్ హీరో పక్కన  జత కట్టే చాన్స్ రావడం అంటే నభా నటేష్ జాతకం మారినట్లే.

IHG

మరి ఇస్మార్ట్ గా అందాల ప్రదర్శన చేసేందుకు ఎపుడూ రెడీ అనే నభా ఎన్టీయార్ తో ఎల స్టెప్పులు వేస్తుందో, జూనియర్ ఫ్యాన్స్ కి ఎలా కిక్కు ఎక్కిస్తుందో చూడాలి, ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుంది అన్న టాక్ ఉంది కాబట్టి ఇక మీదట వరస ఆఫర్స్ వస్తే తొందరలో నభా స్టార్ హీరోయిన్ అవడం ఖాయమేనని అంటున్నారు. చూడాలి మరి నభా లక్కు ఏ నక్కను తొక్కి వస్తుందో.

 

మరింత సమాచారం తెలుసుకోండి: