మెగా బ్రదర్ నాగబాబు సొంత నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్. ఈ నిర్మాణ సంస్థని స్థాపించడానికి కారణం నాగబాబు సోదరుడు మెగాస్టార్ చిరంజీవి. నాగాబాబు నటుడికంటే నిర్మాతగా బాధ్యతలు బాగా నిర్వర్తిస్తాడన్న ఆలోచనతో చిరంజీవి నాగబాబు తో ఈ నిర్మాణ సంస్థని స్థాపించారు. మొట్ట మొదటి ప్రయత్నంగా ఈ సంస్థలో రుద్రవీణ అన్న సినిమాని నిర్మించారు. కె.బాలచందర్ దర్శకత్వంలో రూపొందిన ఈ అద్భుత దృశ్య కావ్యం మెగా అభిమానులకే కాదు తెలుగు ప్రేక్షకులందరికి ఎప్పటికి గుర్తుండి పోతుంది. 

 

కమర్షియల్ హీరోగా మంచి ఫాంలో ఉన్న చిరంజీవి చేసిన ఈ వినూత్న ప్రయోగం తో ఏకంగా నేషల అవార్డ్ ని సాధించారు చిరంజీవి. మెగా సోదరుల తండ్రి కె.వెంకట్ రావు సమర్పణలో అంజనా ప్రొడక్షన్స్ లో నిర్మించిన ఈ సినిమాకి ప్రత్యేకమైన స్థానం ఎప్పటికీ ఉంటుంది. అయితే ఈ సినిమా కమర్షియల్ గా మాత్రం అనుకున్నంతగా అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత త్రినేత్రుడు ముగ్గురు మొనగాళ్ళు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, రాధా గోపాలం, స్టాలిన్, ఆరెంజ్ సినిమాలు నిర్మించారు.

 

అయితే ఈ సంస్థ లో రాం చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ ఓవర్ బడ్జెట్ కావడం వల్ల బెడిసికొట్టింది. నమ్మకం పెట్టుకున్న వాళ్ళు నాగబాబు ని నిండా ముంచేసి ఇష్టమొచ్చినట్టు బడ్జెట్ పెట్టడంతో దారుణంగా అప్పుల్లో కూరుకు పోయాడు నాగబాబు. అన్న చిరంజీవి..తమ్ముడు పవన్ కళ్యాణ్ అండ ఉండటంతో త్వరగానే ఆ కష్టాల్లో నుంచి బయట పడ్డారు. అంతే అప్పటి నుంచి నాగబాబు మళ్ళీ ప్రొడక్షన్ జోలికి వెళ్ళలేదు. అయితే ఇప్పుడు నాగబాబు కి వరుణ్ బాబు కొండంత అండగా నిలబడ్డాడు. 

 

అద్భుతమైన కథ లను ఎంచుకుంటూ మంచి రెమ్యునరేషన్ అందుకుంటూ సెటిలయ్యాడు. దాంతో వరుణ్ తేజ్ కి తిరిగి నాన్న ని సక్సస్ ఫుల్ నిర్మాతగా చూడాలనుకుంటున్నాడట, అందుకే త్వరలో మళ్ళీ నాన్న నాగబాబుతో వరుణ్ బాబు అంజనా ప్రొడక్షన్స్ ని ప్రారంబించాలని సన్నాహాలు చేస్తున్నాడని తాజా సమాచారం. ఇదే గనక నిజమైతే మెగా ఫ్యాన్స్ కి వచ్చే ఉత్సాహం రెట్టింపు అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: