టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అక్కడక్కడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన యువ నటుడు విజయ్ దేవరకొండ, ఆ తరువాత కొంత కాలానికి తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా మారిన విషయం తెలిసిందే. అయితే హీరోగా మారి నటించిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన విజయ్, ఆ తరువాత  సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఒక్కసారిగా మంచి క్రేజ్ సంపాదించాడు. ముఖ్యంగా ఆ సినిమా విజయ్ ని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది అనే చెప్పాలి. ఇక ఆపై యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ హిట్ కొట్టడంతో యువతలో మంచి ఫేమ్ ని విజయ్ సొంతం చేసుకోవడం జరిగింది. 

IHG's film titled 'Fighter ...

అయితే ఆ తరువాత నుండి మాత్రం ఇప్పటివరకు విజయ్ కు కెరీర్ పరంగా పెద్దగా సక్సెస్ లు దక్కలేదనే చెప్పాలి. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు సహా పలు ఇతర భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఫైటర్ లో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా, పూరి జగన్నాథ్, ఛార్మి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా, ఈ సినిమాలో విజయ్ తల్లి పాత్రలో సీనియర్ నటి రమ్యకృష్ణ నటిస్తున్నట్లుగా లేటెస్ట్ ఫిలిం నగర్ టాక్. 

IHG

గతంలో వచ్చిన బాహుబలి రెండు సినిమాల్లో కూడా శివగామి పాత్రలో మెరిసిన రమ్యకృష్ణ, తనదైన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫైటర్ సినిమాలో హీరో తల్లి పాత్ర ఎంతో కీలకమైందని, అందువల్ల అటువంటి పాత్రకు రమ్యకృష్ణ అయితేనే న్యాయం చేయగలరని భావించిన పూరి, ఆమెను ఫైనల్ గా ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. కాగా అతి త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు ఓపిక పట్టాల్సిందే....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: