హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. బ్రేక్ లేకుండా 5నుంచి 10ఏళ్లు సినిమాలు చేశారంటే గొప్ప అనేలా ఉంటుంది. ఇలా కష్టంగా కెరీర్ సాగిస్తున్న హీరోయిన్ల పాలిట శాపంలా తయారైంది కరోనా. సీనియర్ల ఫ్యూచర్ ని దెబ్బకొడుతూ.. స్టార్ హీరోయిన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది కోవిడ్ 19.

 

కాజల్ అగర్వాల్ ఇప్పుడు 34లో ఉంది. పెరిగిపోతున్న ఈ వయసే చందమామ అవకాశాలను దెబ్బకొడుతోంది. చాలామంది హీరోలు థర్టీ ప్లస్ లో ఉందని కాజల్ ని పక్కన పెట్టేస్తున్నారు. స్టార్ హీరోలు అయితే కాజల్ ని ఫస్ట్ ఆప్షన్ గా చూడలేకపోతున్నారు. దీంతో చిన్న సినిమాలు, సీనియర్ హీరోలతో జోడీ కొడుతూ కెరీర్ నెట్టుకొస్తోంది. ఇలాంటి టైమ్ లో కరోనా లాక్ డౌన్ ఈమెను మరింత ఇబ్బంది పెడుతోంది. 

 

కాజల్ ఖైదీ నెంబర్ 150 తర్వాత కొంచెం స్లో అయినట్టు కనిపించింది. మిత్రవింద ఫేడౌట్ అవుతుందనే కామెంట్స్ కూాడ వినిపించాయి. అయితే మళ్లీ పుంజుకొని మొత్తం 6 సినిమాలకు సైన్ చేసింది. చిరంజీవి ఆచార్యతో పాటు తెలుగు, తమిళ్, హిందీల్లో కలిపి అరడజను వరకు సినిమాలున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్స్ తో బిజీగా కనిపించిన కాజల్ కు ముందుముందు టఫ్ సిట్యువేషన్స్ ఎదురవుతాయనే టాక్ వస్తోంది. 

 

సినిమా ఇండస్ట్రీ కరోనా లాక్ డౌన్ తో మూడు నెలల నుంచి బంద్ పాటిస్తోంది. ఈ బంద్ లేకపోయి ఉంటే.. కాజల్ ఇప్పటికి రెండు, మూడు సినిమాల కంప్లీట్ చేసేది. కానీ కరోనా లాక్ డౌన్ తో షూటింగ్స్ ఆగిపోయాయి. కోవిడ్ ప్రభావం తగ్గేవరకు మళ్లీ షూటింగ్ లకు వెళ్లేందుకు హీరోలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. సో కాజల్ కెరీర్ లో ఇక ఒక సంవత్సరం వృథాగా పోతుందనే చెప్పాలి. 

 

కరోనాతో ఇండస్ట్రీ చాలా నష్టపోతోంది. నిర్మాతలకు కోట్లలో నష్టమొస్తుంది. అయితే ఫినాన్షియల్ లాస్ వచ్చినా రికవరీ చేసుకోవచ్చు గానీ.. కెరీర్ కరిగిపోతుంటే సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. అలాంటి టఫ్ సిట్యువేషన్ లోనే ఉంది తమన్నా. 

మరింత సమాచారం తెలుసుకోండి: