అమ్రీష్ పురి తెలుగు సినీ అభిమానుల‌కు పెద్దగా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. త‌న విల‌క్ష‌ణ న‌ట‌న‌తో కంచు కంఠంతో...ప్ర‌తినాయ‌క పాత్ర‌కే క్రేజీ తెచ్చిన న‌టుడు ఆయ‌న‌. వంద‌లాది భారతీయ సినిమాల్లో న‌టించి కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న న‌టుడు. ఒక ద‌శ‌లో హీరోల‌క‌న్నా..ఎక్కువ పారితోషికం తీసుకున్న తొలి ప్ర‌తినాయ‌క పాత్ర న‌టుడ‌ని చెప్పాలి. అంబ‌రిష్‌పురి ప్ర‌తినాయ‌క పాత్ర‌కు ఒప్పుకున్నాడంటే అదృష్టంగా భావించిన నిర్మాత‌లెంద‌రో...అంత ఘ‌న‌కీర్తి క‌లిగిన అతిత‌క్కువ న‌టుల్లో అంబ‌రీష్ ఒక‌రు. సోమ‌వారం ఆయ‌న జ‌యంతి. 1932 జూన్ 22న ఆయ‌న జ‌న్మించారు. ఇతని సోదరులు మదన్ పురి, ఓం పురి కూడా మంచి ప్ర‌తినాయ‌క పాత్ర‌దారులుగా ప్ర‌సిద్ధిపొందారు.


అమ్రీష్‌పురి తెలుగులో చాలా సినిమాలే చేశారు. అందులో ఎన్టీఆర్‌తో క‌ల‌సి న‌టించిన చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు ధీటుగా న‌టించి ప్ర‌శంస‌లు అందుకున్నారు. బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన ఆదిత్య 369లో శాస్త్ర‌వేత్త‌గా ప్ర‌తినాయ‌క పాత్ర‌లో క‌నిపించారు. అలాగే తెలుగు ప్రేక్ష‌కులకు అమ్రీష్ పురిని అత్యంత ద‌గ్గ‌ర చేసిన చిత్రాలు జగదేకవీరుడు అతిలోకసుందరి,
కొండవీటి దొంగ, అశ్వమేధం, ఆఖరి పోరాటం, దళపతి సినిమాలు. ఈ సినిమాలోని అమ్రీష్‌పురి న‌ట‌న అసామ‌న్య‌. భ‌యంక‌ర‌మైన హావాభావాలు...గెట‌ప్ కూడా అదే విధంగా ఉండేంది. ప్ర‌తినాయ‌క పాత్రంటే ప్రేక్ష‌కుడి మ‌దిలో ఉండిపోయేలా ఉండేది. అందుకు ఆయ‌న‌కు వ‌చ్చిన పాత్ర‌లు కూడా దోహ‌దం చేశాయ‌నే చెప్పాలి. క‌థ న‌చ్చితే గాని ఓ ప‌ట్టాన ఒప్పుకునే వాడు కాద‌ని సీనియ‌ర్ సినిమా నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు అమ్రీష్‌పురి గురించి గొప్ప‌గా చెబుతుంటారు. ఎంతో వైవిధ్య‌మైన న‌ట‌న‌ను తెర‌పై ప్ర‌ద‌ర్శించిన అమ్రీష్‌పురిని ఎన్నో అవార్డులు, స‌త్క‌రాలు వ‌రించాయి. 

 

అమ్రీష్‌పురికి ద‌క్కిన కొన్ని ముఖ్య‌మైన అవార్డులు ఇవీ..

1968:విజేత: మహారాష్ట్ర రాష్ట్ర నాటక పోటీలు
1979:విజేత:సంగీత నాటక అకాడమీ పురస్కారము నాటకరంగము కోసం
1990:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-త్రిదేవ్ చిత్రం కోసం
1986:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము, మేరీ జంగ్ చిత్రం కోసం
1991:విజేత:మహారాష్ట్ర రాష్ట్ర గౌరవ పురస్కారము
1994:విజేత:సిడ్నీ చలన చిత్రోత్సవం, ఉత్తమ నటుడు పురస్కారము– సూరజ్ కా సాత్వా ఘోడా చిత్రం కోసం
1994:విజేత:సింగపూర్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, ఉత్తమ నటుడు పురస్కారము– సూరజ్ కా సాత్వా ఘోడా చిత్రం కోసం
1996:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము, కరణ్-అర్జున్ చిత్రం కోసం
1996:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రం కోసం
1993:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ముస్కురాహట్ చిత్రం కోసం
1994:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-గర్దిష్ చిత్రం కోసం
1997:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ఘటక్ చిత్రం కోసం
1997:విజేత:స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-ఘటక్ చిత్రం కోసం
1999:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము కోయ్లా చిత్రం కోసం
1998:విజేత:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-విరాసత్ చిత్రం కోసం
1998:విజేత:స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారము-విరాసత్ చిత్రం కోసం
2000:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము బాద్షా చిత్రం కోసం
2002:పరిశీలన:ఫిల్మ్ ఫేర్ ఉత్తమ ప్రతినాయకుడు పురస్కారము గదర్-ఏక్ ప్రేమ్ కథా చిత్రం కోసం

మరింత సమాచారం తెలుసుకోండి: