టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే రమ్యకృష్ణ కు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన  పని లేదు. రెండు భాషల్లో కూడా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుని ఒక వెలుగు వెలుగుతుంది రమ్యకృష్ణ. ఆమె సినిమాలు, చిన్న వయసు లోనే హీరోయిన్ అయిన విధానం అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక స్టార్ హీరోలు అందరి తో వరుసగా సినిమాలు చేసి మంచి హిట్స్ కొట్టి అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రమ్యకృష్ణ. ఆమె సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు ఒక రేంజ్ లో పండగే. 

 

ఇక అది అలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంలో దర్శకుడు కృష్ణ వంశీ ని ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. కృష్ణ వంశీ ని ప్రేమించి ఆమె పెళ్లి చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి ఆమె హీరోయిన్ గా పాత్రలకు గుడ్ బై చెప్పి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ వస్తున్నారు. అగ్ర హీరోయిన్ అయినా సరే ఎలాంటి పాత్ర అయినా సరే కథ డిమాండ్ చేస్తే మాత్రం ఆమె కచ్చితంగా చేస్తారు అనే పేరు మాత్రం టాలీవుడ్ లో ఉంది అక్కడ తమిళం లో కూడా ఉంది. పెళ్లి అయిన తర్వాత భర్త ప్రోత్సాహం తో ఆమె మరింత అందంగా నటించే ప్రయత్నం చేసారు. 

 

బాహుబలి సినిమాలో ఆమె చేసిన పాత్ర ఆమె కెరీర్ లోనే ది బెస్ట్ గా చెప్తారు చాలా మంది. ఆ విధంగా ఆమె ఆ పాత్ర తో వేలాది మంది కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు అనే  చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో అక్కడి నుంచి ఆమెకు వరుసగా పాత్రలు వచ్చాయి. ఆమె సినిమాల కోసం ఇప్పటికి కూడా ఫాన్స్ ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: