మన తెలుగులో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన మార్క్ ని వేసిన నటి ఆసిన్. అగ్ర హీరోలు వెంకటేష్, నాగార్జున వంటి వారి తో మంచి సినిమాలు చేసింది. ఇక అటు తమిళం లో కూడా సూర్య వంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు చాలా మంచి పేరు తీసుకొచ్చాయి అనే చెప్పాలి. అగ్ర హీరోలతో చాలా తక్కువ కాలంలో చాలా మంచి సినిమాలు చేసిన హీరోయిన్ గా ఆమెకు చాలా మంచి పేరు ఉంది అనే చెప్పాలి. ఇక ఇదిలా  ఉంటే ఆమె కెరీర్ లో ఒక్కసారిగా ఆఫర్లను కోల్పోయింది అని చెప్పాలి. 

 

అగ్ర హీరోలతో సినిమాలు చేసే అవకాశం నుంచి అసలు ఆఫర్లు రాని దశకు ఆమె వెళ్ళింది. దీనికి కారణం బాలీవుడ్ మీద ఆమె చేసిన ఫోకస్ అని అంటారు జనాలు. అక్కడ అగ్ర హీరోలతో ఆఫర్లు రావడం తో ఆమె ఆ విధంగా సినిమాలను ఇక్కడ తెలుగు లో కూడా అనవసరంగా వదులుకుంది అని అంటారు జనాలు. ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు. రాహుల్ శర్మ అనే వ్యక్తిని ఆమె వివాహం చేసుకున్నారు. ఇక  వారికి ఒక పాప కూడా ఉంది. ఇప్పుడు ఆమె వ్యాపార వ్యవహారలనుఎక్కువగా చూస్తున్నారు. 

 

ఆమెకు ఆఫర్లు ఇచ్చే దర్శక నిర్మాతలు కూడా పెద్దగా లేరు అనే చెప్పాలి. అందుకే ఆమె సినిమాలకు దాదాపుగా దూరంగా ఉంది అని చెప్పాలి. మరి టాలీవుడ్ లో ఒక సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది అనే టాక్ వినపడింది గాని ఆమెకు రాలేదు అని కొందరు అన్నారు. ఇక ఇప్పుడు ఆమె సినిమాల్లో చేయకుండా ఏదో ఛానల్ లో  ఉద్యోగం చెయ్యాలి అని నిర్ణయం తీసుకున్నారు అనే టాక్ కూడా వినపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: