ఇండియన్ సినిమాలో సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె సినిమాలు ఆమె నటన ఆమెకు వచ్చిన పేరు ప్రతీ ఒక్కటి కూడా సంచలనం అనే చెప్పాలి. అగ్ర హీరోలతో సినిమాలు చేయడం అనేది  ఒకప్పుడు చాలా కష్టం. కాని ఆమె తో అగ్ర హీరోలు సినిమాలు చెయ్యాలి అనుకునే వారు. ఆమె కోసం అటు తమిళం లో ఇటు తెలుగు లో కూడా మంచి పోటీ ఉండేది. ఆమెను సినిమాల్లోకి తీసుకోవాలా వద్దా అనే దశ నుంచి ఆమె లేకపోతే అసలు సినిమా లేదు అనే దశకు ఆమె వచ్చారు అంటే ఆమె ఏ స్థాయిలో విజయవంతం అయ్యారు అనేది చెప్పాల్సిన పని లేదు. 

 

ఇక ఇదిలా ఉంటే ఆమె కెరీర్ లో చేసుకున్న వివాహం ఆమె కెరీర్ ని నాశనం చేసింది అని అంటారు. ఆమె జెమిని గణేషన్ ని వివాహం చేసుకోవడం తో ఆమె పేరు మసకబారింది అని కొందరు అంటే కాదు ఆమె కెరీర్ నాశనం అయింది అంతే కాదు ఆమె వ్యక్తిగత జీవిత౦ కూడా నాశనం అయింది అని అంటారు మరి కొంత మంది. ఆమెకు అవకాశాలు రాకుండా ఆయన అడ్డుకున్నారు అని కొందరు అంటారు. ఇక ఆమెను అన్ని విధాలుగా మానసికంగా వేధించారు అని ఆమె అందుకే ఆ దశకు వచ్చి  చిన్న వయసు లోనే ప్రాణాలు కోల్పోయారు అని అంటారు. 

 

ఆమె అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు అప్పట్లో. ఆమె తో సినిమా చేయడం అనేది చాలా మందికి పైకి చెప్పలేని విధంగా ఒక డ్రీం కూడా. అయినా సరే ఆమె చేసుకున్న వివాహం తర్వాత ఆమె కెరీర్ దాదాపుగా నాశనం అయింది అని  చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు ఇప్పటికి.

మరింత సమాచారం తెలుసుకోండి: