బాలీవుడ్ లో దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగు వెలుగుతుంది. అగ్ర హీరోలతో సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఇక ఆమె కు డేర్ కూడా ఎక్కువే అని చెప్తూ ఉంటారు. ఏ హీరో తో అయినా సరే వరుసగా సినిమాలు చేయడం అవి సూపర్ హిట్ అవ్వడానికి ఆమె వంతు పాత్ర పోషించడం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఆమె అగ్ర హీరోయిన్ గా ఉండటమే కాదు అటు నిర్మాతగా కూడా తన మార్క్ ని వేసారు అనే చెప్పాలి. 

 

ఇక ఆమె కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయంలో రణవీర్ సింగ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఎక్కడా కూడా ఆమె సినిమాల విషయంలో వెనక్కు తగ్గలేదు అనే చెప్పాలి. ముఖ్యంగా భర్త నుంచి ఆమెకు వచ్చిన ప్రోత్సాహం తో ఆమె సినిమాలు చేస్తున్నారు. భర్త ఎక్కడా కూడా ఆమెను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించిన సందర్భం అనేది లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె ఇప్పుడు ఏకంగా ఆరు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏ పాత్రలో అయినా సరే ఆమె కచ్చితంగా తన మార్క్ ని వేస్తూ ఉంటారు. 

 

ఇక అగ్ర హీరోలు కూడా ఆమెతో సినిమాలు చేయడానికి ముందు నుంచి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె చేస్తున్న సినిమాల్లో ఒకటి తెలుగు లో కూడా ఉంది. తెలుగులో ఆమె ఇప్పటి వరకు పూర్తి స్థాయి సినిమా ఏదీ చేయలేదు. ఎన్నో ప్రేమల తర్వాత ఆమె వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: