టాలీవుడ్ లో శ్రేయ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఆమె పైకి వచ్చిన తీరు ఆమెకు వచ్చిన ఆఫర్లు అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. అగ్ర హీరోలతో చాలా తక్కువ కాలంలో ఆమె మంచి సినిమాలు చేస్తూ తన మార్క్ ని వేసారు ఆమె అనేది వాస్తవం. అందం తో పాటుగా అభినయం డాన్స్ నటన అన్నీ కూడా ఆమె నుంచి అభిమానులకు అందాయి అనే చెప్పాలి. ఆమెకు వరుస  ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం చాలా జాగ్రత్తగా సినిమాలు చేసే వారు. అగ్ర హీరోలు అందరి తో ఆమె తెలుగు లో సినిమాలు చేసారు అనే చెప్పాలి. 

 

చిరంజీవి నాగార్జున బాలకృష్ణ  అలాగే వెంకటేష్ తో పాటుగా తరుణ్ వంటి హీరోలతో కూడా ఆమె మంచి సినిమాలు చేసారు. ఇక ప్రభాస్ తో  మహేష్ తో ఆమె చేసిన సినిమాలు సూపర్ హిట్  లు అయ్యాయు. ఆమెకు మంచి పేరు కూడా తీసుకుని వచ్చాయి అనే చెప్పాలి. ఇక ఆమె అంద్రోయ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని సెటిల్ అయ్యారు. ఫారెన్ వ్యక్తి తో ప్రేమ వ్యవహారం నడిపిన ఆమె అక్కడే వివాహం  కూడా చేసుకుని సెటిల్ అయ్యారు. ఇక ఇప్పటికి కూడా ఆమెకు మంచి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆమె కూడా చాలా చక్కగా సినిమాలు చేస్తున్నారు. 

 

బాలయ్య సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చింది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. మరి ఆమెకు ఆఫర్ వచ్చిందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇక ఇప్పుడు ఆమె ఫారెన్ లోనే ఉన్నారు. దాదాపుగా ఆమె అక్కడే ఉంటుంది గాని ఇక్కడికి రావడం లేదు. వరుసగా సినిమా ఆఫర్లతో ఉండే ఆమె ఇప్పుడు ఖాళీ గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: