బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమెకు వచ్చిన స్టార్ ఇమేజ్ గురించి అందరికి తెలిసిందే. అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది ఆమె. దాదాపు 40 ఏళ్ళు వచ్చినా సరే వరుస ఆఫర్లతో అటు బాలీవుడ్ లో, అలాగే హాలీవుడ్ లో కూడా ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. నటన కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ఆమె సినిమాలు చేస్తుంది అనే చెప్పాలి. అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే ఆమె మాత్రం ఎక్కడా కూడా సినిమాల విషయంలో చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా చూపించే ప్రయత్నం చేయకుండా సినిమాలను చేస్తున్నారు అనే చెప్పాలి. 

 

ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలు హాలీవుడ్ లో చేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో కూడా ఆమె రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఇక ఆమె నటన కు మంచి పాత్రలే వస్తున్నాయి. ఆమె కూడా చాలా వరకు జాగ్రత్తగా సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. వయసు మీద పడటం తో ఆమెకు వచ్చే ఆఫర్లు కాస్త వెనక్కు తగ్గుతున్నాయి. అయినా సరే ఆమె ఎక్కడా కూడా భయపడకుండా అందం చూపించే విషయంలో రాజీ పడకుండా చేస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే ఆమె హాలీవుడ్ కి వెళ్లి అక్కడి వ్యక్తినే వివాహం చేసుకుంది. 

 

తనకంటే చాలా చిన్న వాడు అయిన వ్యక్తిని ఆమె వివాహం చేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఇక బాలీవుడ్ కి ఆమె సినిమా అవకాశాలు వస్తే మినహా పెద్దగా రావడం లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఆమెకు హాలీవుడ్ లో డిమాండ్ కూడా ఉంది బోల్డ్ గా సినిమాలు చేస్తుంది అనే పేరు కూడా ఆమె సొంతం అనే చెప్పాలి. తెలుగులో ఒక సినిమా చేస్తుంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: