లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమైన కాజల్ అగర్వాల్, క్రిష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చందమామ సినిమాతో మొదటి హిట్ అందుకుంది. ఆ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఇండస్ట్రీకి వచ్చి 13 ఏళ్ళు అవుతున్న వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అయితే మధ్యలో ఎన్నో ఒడుదుడుకులు వచ్చినా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే ఉంది.

 


ప్రస్తుతం కాజల్ చేతిలో చాలా సినిమాలున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య, శంకర్ దర్శకత్వమ్లో కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 చిత్రంలో. మంచు విష్ణు తెరకెక్కిస్తున్న తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో విడుదల అవుతున్న మోసగాళ్ళు, ముంబయి సాగా వంటి భారీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. అయితే వరుస అవకాశాలతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ పెళ్ళి ఎప్పుడు చేసుకుంటుందనేది చాలా రోజులుగా అందరిలో కలుగుతున్న ప్రశ్న.

 

అప్పట్లో తనకి పెళ్ళి చేసుకునే ఉద్దేశ్యమే లేదని చెప్పిన కాజల్ అగర్వాల్, పెళ్ళికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే 35వ జన్మదినం జరుపుకున్న కాజల్ పెళ్ళికి సిద్ధమవుతుందట. పెళ్ళి చేసుకుని సెటిల్ అవ్వాలని భావిస్తోందని సమాచారం. అది కూడా తన తల్లిదండ్రులు కుదిర్చిన వివాహం చేసుకోవాలని అనుకుంటుందిట. ఈ మేరకు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారని టాక్.  

 

మహారాష్ట్ర ఔరంగాబాద్ కు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవెత్తని పెళ్లి చేసుకోవడానికి కాజల్ ఒప్పుకున్నట్లు సమాచారం. అతి త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వివరాల్ని కాజల్ బయటపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈ విషయమై కాజల్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి. టాలీవుడ్ సెలెబ్రిటీలు అందరూ సడెన్ షాక్ ఇచ్చినట్టు కాజల్ కూడా షాక్ తను చేసుకోబోయే అతన్ని పరిచయం చేసి షాక్ ఇస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: