1950-60 సంవత్సరాల్లో తెలుగు పరిశ్రమలో అగ్రతారగా కొనసాగిన సహజ నటి సావిత్రి జీవితంలో ఎన్నో విషాదకరమైన విషయాలు చోటుచేసుకున్నాయి. తాను ఆరు నెలల పాప గా ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. దాంతో తన తల్లితో కలిసి తన పెద్దనాన్న ఇంట్లో పెరిగి పెద్దదయింది. చిన్నతనంలో ఆమె సరిగ్గా చదువుకోకుండా ఎక్కువగా నాట్య ప్రదర్శనలలో, టాలెంట్ పోటీలలో పాల్గొనేది. సినిమాల్లో నటించేందుకు మద్రాసు వెళ్లినప్పుడు ఆమె వయసు కేవలం 12 సంవత్సరాలు మాత్రమే. ఫస్ట్ సినిమాలో అవకాశం చేజిక్కించుకునే ముందు ఆమె ఎన్నో కష్టాలు, బాధలు పడింది. సంసారం సినిమాలో చిన్న పాత్ర దక్కించుకుంది కానీ ఆమెకు ఎక్కువ వయసు లేకపోవడంతో ఆ అవకాశాన్ని కూడా కోల్పోయింది.


ఎన్టీ రామారావు నటించిన పాతాళ భైరవి సినిమాలో ఓ చిన్న పాత్రలో సావిత్రి నటించింది. 1952లో విడుదలైన పెళ్లి చేసి చూడు సినిమా లో సెకండ్ హీరోయిన్ గా నటించిన సావిత్రి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తమిళ, తెలుగు సినిమాలను మినహాయించి అయిదు హిందీ చిత్రాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పేరు సంపాదించింది. త్రిప్రయార్ సుకుమారన్ దర్శకత్వం వహించిన చుజి మలయాళ చిత్రం లో సావిత్రి ఆల్కహాల్ కి బానిసైన ఎలిజబెత్ అనే ఓ తల్లి పాత్రలో నటించి తన కూతురు ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకొని గర్భం ధరిస్తుంది. ఈ పాత్రలో సావిత్రి నటనకు మలయాళ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఎం.ఎస్ బాబురాజ్ అందించిన సంగీతం కూడా అందరినీ ఫిదా చేసేసింది. సావిత్రి చిన్నప్పటినుండే నాట్యం నేర్చుకోవడం తో తన సినిమాలోని పాటలలో అద్భుతంగా డాన్స్ చేసి ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసేది. తన వాయిస్ కూడా చాలా మధురంగా ఉంటుంది. 


1956వ సంవత్సరంలో జెమినీ గణేషన్ అనే తమిళ నటుడిని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు-- విజయ చాముండేశ్వరి, సతీష్ కుమార్ లకు జన్మనిచ్చింది. అప్పటికే జెమినీ గణేషన్ ఇద్దరిని పెళ్ళాడాడు. ఇతర యువతులతో కూడా అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అయినా సావిత్రి అవన్నీ మన్నించి అతడిపై కొండంత నమ్మకం ఉంచి ప్రేమ పెళ్లి చేసుకుంది. కానీ తన నమ్మకాన్ని వమ్ము చేసి జెమినీ గణేషన్ ఇతర యువతులతో అక్రమ సంబంధాలను పెట్టుకునేవాడు. ఈ విషయం తెలిసి సావిత్రి బాగా మనస్తాపం చెందింది. 1969 సంవత్సరంలో ఆమె తన బాధను మర్చిపోలేక రోజుకు ఎన్నో బాటిళ్ల ఆల్కహాల్ను సేకరించినది. ఇలా తాగడం వల్లనే ఆమెకు బీపీ (హై బ్లడ్ ప్రెజర్), డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చాయి. 19 నెలల పాటు కోమాలో ఉండి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ తన 46 ఏళ్ల వయసులో ఆమె తనువు చాలించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: