రంభ... ఈ పేరు కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా కొనసాగిన రంభ తన అందచందాలతో సినీ ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన అతి తక్కువ సమయంలోనే నటించే అవకాశాన్ని చేజిక్కించుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. హలో బ్రదర్ సినిమా లో కన్నెపెట్టరో కన్నుకొట్టరో పాటలు రంభ అందచందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 1992 వ సంవత్సరంలో విడుదలైన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్రప్రసాద్ సరసన నటించిన రంభ తన అందచందాలతో ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేసింది. 

IHG
ఆమె అసలైన పేరు విజయలక్ష్మి కాగా ఆ ఒక్కటి అడక్కు సినిమా తర్వాత తన స్క్రీన్ నేమ్ రంభ గా మారిపోయింది. ఈమె మాతృభాష తెలుగు అయినప్పటికీ హిందీ తమిళ కన్నడ బెంగాలి వంటి పలు భాషా చిత్రాల్లో నటించి ప్రతి చోట మంచి పేరు సంపాదించింది. పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె సినిమాలకు దూరం అయిపోయింది అని చెప్పుకోవచ్చు. తెలుగులో చివరిసారిగా 2008లో విడుదలైన దొంగ సచ్చినోడు సినిమాలో కనిపించింది. 2011 వ సంవత్సరంలో మలయాళం సినిమా ఫిల్మ్ స్టార్ లో కనిపించిన తర్వాత ఆమె సినిమాలో అసలు నటించలేదు.

IHG

2010 ఏప్రిల్ నెలలో ఆమె ఇంద్రన్ పద్మనాధన్ అనే వ్యక్తిని వివాహమాడింది. ఈయన కెనడా దేశంలో స్థిరపడిపోయిన భారతీయ వ్యాపారవేత్త కాగా... తన భార్య రంభను కూడా కెనడాలోని టొరంటో నగరానికి తీసుకెళ్లి తన వైవాహిక జీవితాన్ని చాలా విలాసవంతంగా కొనసాగిస్తున్నాడు. 2011 వ సంవత్సరంలో రంభ మొదటి బిడ్డ లావణ్యకు 2015 సంవత్సరంలో రెండవ బిడ్డ శాషాకు జన్మనిచ్చింది. వీళ్ళిద్దరికీ ఏవో కొన్ని మనస్పర్థలు రావడంతో 2017 వ సంవత్సరంలో తన భర్తను వదిలేసి చెన్నై కి వచ్చేసింది రంభ. ఆ తర్వాత మళ్ళీ తన భర్త పిల్లలతో కలిసి ఉండాలని నిశ్చయించుకున్న రంభ అతడి వద్దకు వెళ్ళిపోయింది. 2018 సంవత్సరంలో ఒక పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది రంభ. ప్రస్తుతం ఆమె కెనడా లో తన భర్త పిల్లలతో చాలా సంతోషంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: