1958 డిసెంబర్ 17వ తేదీన తమిళనాడులోని చెన్నై లో జన్మించిన జయసుధ అసలు పేరు సుజాత నిడదవోలు కాగా... సినీ రంగ ప్రవేశం చేసిన తర్వాత సుజాత అనే పేరుతో ఇంకొక నటీమణి కూడా ఉండడంతో ఆమె తన పేరు మార్చుకుంది. అప్పట్లో తెలుగు పరిశ్రమలో నటీమణిగా, డైరెక్టర్ గా కొనసాగుతున్న విజయనిర్మల జయసుధకు మేనత్త. 1972వ సంవత్సరంలో విడుదలయిన పండంటి కాపురం సినిమా లో జమున కూతురు గా జయసుధ నటించింది.

IHG

అప్పటికి తన వయసు కేవలం 12 సంవత్సరాలే. 1973 వ సంవత్సరం లో దర్శకుడు బాలచందర్ తెరకెక్కించిన తమిళ సినిమా అరంగేట్రం లో కమల్ హాసన్ సరసన జయసుధ నటించింది. 1979వ సంవత్సరంలో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇది కథ కాదు సినిమా లో చిరంజీవి సరసన నటించిన జయసుధ మంచి నటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించింది. 

IHG
అయితే 1975వ సంవత్సరంలో లక్ష్మణరేఖ సినిమాలో మొదటి సారిగా హీరోయిన్ గా కనిపించింది కాని ఆమెకు అప్పుడు అంతగా గుర్తింపు రాలేదు. చిరంజీవి సినిమాలో నటించిన తర్వాత ఆమెకు బాగా పాపులారిటీ రావడంతో అనేక సినీ అవకాశాలు దన్నుకొచ్చాయి. ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి తెలుగు పరిశ్రమలో అగ్ర తారగా ఎదిగింది. వాస్తవానికి ఆమెకు తెలుగు చదవడం, రాయడం రాదు. దీంతో ఎవరో ఒకరి సహాయంతో డైలాగులను గట్టిగా చెప్పించుకొని వాటిని యధావిధిగా గుర్తుంచుకొని అద్భుతంగా చెప్పేది. తెలుగు రాకుండానే తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన జయసుధ పట్టుదల కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. కేవలం ఒకే ఒక సంవత్సరంలో 24 సినిమాల్లో నటించిన జయసుధ మొత్తంగా 325 సినిమాల్లో నటించి సినీ ప్రేక్షకులను బాగా అలరించింది. 

IHG
ఆమె వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుంటే... నిర్మాత వడ్డే రమేష్ బావమరిది అయిన రాజేంద్రప్రసాద్ ను విజయవాడలో పెళ్లి చేసుకుంది. కానీ ఏవో కారణాలవల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు. తదనంతరం ప్రముఖ హిందీ నటుడు జితేంద్ర కు బంధువైన నితిన్ కపూర్ అనే ఒక నిర్మాతను 1985వ సంవత్సరంలో జయసుధ పెళ్లాడింది. వీళ్లిద్దరి వైవాహిక జీవితంలో ఇద్దరు కొడుకులు నిహార్, శ్రేయన్ జన్మించారు. మార్చి 14, 2017 వ సంవత్సరం లో జయసుధ భర్త నితిన్ కపూర్ ఒక భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను ఆత్మహత్య చేసుకోవడానికి డిప్రెషన్ కారణమని వార్తల్లో వచ్చాయి కానీ అతడి మరణం వెనుక నిజమైన కారణం ఏంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: