స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకుని నాన్ బాహుబలి రికార్డుని క్రియేట్ చేసాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా స్టార్ట్ చేసిన బన్నీ, పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని తీర్చి దిద్దుతున్నాడు.

 

ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల వద్ద నుండి మంచి స్పందన లభించింది. ఊరమాస్ గెటప్ లో బన్నీ లుక్ అదిరిపోయింది. లారీ డ్రైవర్ గా బన్నీ లుక్ అదిరిపోయింది. రంగస్థలంలో రామ్ చరణ్ లాగా, పుష్పలో బన్నీ గెటప్ కి మంచి పేరొచ్చింది. రష్మిక మందన్న ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది.

 

పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బన్నీ ఎంత పారితోషికం తీసుకుంటున్నాడనేది హాట్ టాపిక్ గా మారింది. బన్నీ కెరీర్లో ఇదే మొట్టమొదటి పాన్ ఇండియన్ చిత్రం. తెలుగుతో పాటు మళయాలంలోనూ బన్నీకి మంచి క్రేజ్ ఉంది. అటు హిందీ డబ్బింగ్ వెర్షన్లకి రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తుంటాయి. అందువల్ల పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే ఈ సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుందన్న నేపథ్యంలో బన్నీ తన రెమ్యునరేషన్ ని బాగా పెంచాడని టాక్.

 

అల వైకుంఠపురములో చిత్రానికి 25 కోట్లు తీసుకున్నాడని వార్తలు వస్తుండగా, సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప కి 35 కోట్లు తీసుకోనున్నాడని ప్రచారం జరుగుతుంది. మైత్రీ మూవీస్ తెరకెక్కిస్తున ఈ చిత్రం పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుంది. చిత్తూరు ప్రాంత నేపథ్యంలో సాగుతున్న ఈ చిత్రంలో ఎక్కువ మంది నటీనటులని కొత్తవాళ్లనే తీసుకున్నారు. కరోనా కారణంగా అక్టోబర్ లో షూటింగ్ ప్రారంభం కానుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: