తెలుగు చిత్ర పరిశ్రమలో జయప్రద కు  ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది జయప్రద. తన అందం అభినయంతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంటుంది. ఎంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ నటిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది జయప్రద. సినిమా ఫైనాన్షియర్ అయిన జయప్రద  తండ్రి.. జయప్రదను  సినిమాల్లోకి తీసుకు వచ్చారు. 13వ ఏట నుంచే సినిమాల్లో నటించడం ప్రారంభించింది జయప్రద. ఇక ఆ తర్వాత ఓ తమిళ సినిమా ద్వారా హీరోయిన్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది.  

 

 

 

 ఆ తర్వాత కె.బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జయప్రద. అప్పట్లో ఈ సినిమా ఎంతో సంచలన విజయం సాధించడంతో నటిగా తన తొలి చిత్రమే ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో చేజిక్కించుకుంది  జయప్రద. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించింది జయప్రద. తర్వాత తక్కువ కాలంలోనే సూపర్ హీరోయిన్ గా ఎదిగింది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కృష్ణ సరసన నటించిన ఎన్నో సినిమాలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైళ్ళు రాళ్లుగా  నిలిచిపోయాయి  అని చెప్పాలి. 

 

 

 ఆ తర్వాత నిర్మాత అయిన శ్రీకాంత్ సహాతాను వివాహం చేసుకుంది జయప్రద. అప్పటికే శ్రీకాంత్ కి  వివాహం జరిగి ముగ్గురు పిల్లలు ఉన్నారు. తర్వాత వీరిద్దరి మధ్య  వివాదాలు వచ్చాయి. తన భర్త నుంచి విడిపోయి విడిగా ఉంటుంది జయప్రద. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరిన జయప్రద... పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎన్నికయింది. ఆ తర్వాత ఒక్కసారిగా నార్త్ రాజకీయాల వైపు వెళ్లిన జయప్రదం సమాజ్వాదీ పార్టీలో చేరి కీలక నేతగా ఎదిగి... రాంపూర్ నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికైంది..ఇలా  జయప్రద ప్రస్థానం కొనసాగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: