మెగాస్టార్ చిరంజీవి కి పర్ఫెక్ట్ జోడీగా ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అలనాటి నటి రాధ. అలనాటి అందాల తారగా తమిళ కన్నడ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎనలేని గుర్తింపు సంపాదించుకున్న నటి రాధ. కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే 250కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు తన హవా  నడిపించింది రాదా. అయితే రాధా కేవలం ఒక గొప్ప నటి మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. 1980 లలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది రాదా . దాదాపుగా స్టార్ హీరోలందరి సరసన నటించింది. రజనీకాంత్ కమల్ హాసన్ మెగాస్టార్ సహా మరింత మంది స్టార్ హీరోల సరసన నటించి గుర్తింపు సంపాదించింది. తన నటనతో ఎన్నో అవార్డులు రివార్డులను సైతం అందుకుంది రాదా. 

 


 అయితే స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ ఉండి  వరకు అవకాశాలను అందుకుంటున్న సమయంలోనే తన బంధువైన మని అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ తర్వాత అక్కడే స్థిరపడి పోయింది రాదా. పెళ్లి తర్వాత రాధా ఎక్కడ వెండితెరపై మెరవలేదు పూర్తిస్థాయిలో సినిమాలకు స్వస్తి చెప్పేసింది. అక్కడ ఒక రెస్టారెంట్ ని కూడా నిర్వహిస్తుంది రాదా. ఇక రాద కి  ఇద్దరు కుమార్తెలు. వారి పేరు తులసి కార్తిక. ఇక తన ఇద్దరు కుమార్తెలను చిత్ర పరిశ్రమలో హీరోయిన్లను చేయాలని రాధా ఎంతగానో కష్టపడింది అనే చెప్పాలి. కార్తీక తెలుగు చిత్ర పరిశ్రమలో జోష్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. 

 


 ఇక ఆ తర్వాత తమిళ సినిమా ఆయన రంగం తెలుగు రీమేక్ లో మంచి గుర్తింపు సంపాదించింది కార్తిక. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో కార్తీక ఎన్నో అవకాశాలను కూడా అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది కార్తీక. కానీ స్టార్ హీరోయిన్గా మాత్రం నిలదొక్కుకోలేకపోయింది అనే చెప్పాలి. ఇక అల్లరి నరేష్ తో  బ్రదర్ అఫ్ బొమ్మాలి లో కూడా ప్రధాన పాత్రలో నటించింది కార్తీక అయినప్పటికీ క్రేజ్  సంపాదించలేకపోయింది. ఇక తులసి మణిరత్నం కడలి సినిమాతో హీరోయిన్గా పరిచయం అయినప్పటికీ తులసి కూడా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. ఇలా తన ఇద్దరు కూతుళ్లను హీరోయిన్ గా మార్చాలి అనుకున్న రాధ సక్సెస్ సాధించలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: