ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో సినిమా షూటింగ్ ల విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల షూటింగ్ లు చేసుకోవాలి అని చెప్పినా సరే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఇప్పుడు వెనక్కు తగ్గారు. అయితే ఇప్పుడు కరోనా తీవ్రత నేపధ్యంలో సినీ పరిశ్రమ ఒక నిర్ణయం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. 

 

ఇప్పుడు పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లను అన్నీ పూర్తి చేసి  కొత్త సినిమాలకు అసలు ఎవరూ ఇప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళవద్దు అని పరిస్థితి మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉంది అని హెచ్చరించారట. ఇక సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అదే విధంగా సీనియర్ నటులు కొందరు షూటింగ్ లు వద్దు అనే నిర్ణయానికి వచ్చారు అని సమాచారం. 

 

ఓ వైపు ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ‌లో ఈ కేసులు మ‌రింత ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు  కేసులు పెరుగుతున్నాయని ఎక్కడో నుంచి నటులు వస్తారు అని వారితో కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది అన్న నిర్ణ‌యానికి ఇండ‌స్ట్రీ పెద్ద‌లు వ‌చ్చార‌ట‌.

 

ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు అందరూ కూడా ముందు క్వారంటైన్ లో ఉండి ఆ తర్వాతః షూటింగ్ కి వెళ్ళడం మంచిది అని సూచనలు వెళ్లినట్టు తెలుస్తుంది. చూడాలి. ఈ లెక్క‌న చూస్తే మ‌న షూటింగ్‌లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ?  కూడా అర్థం కావ‌డం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: