తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెల్సిందే. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుని స్టార్ హీరోలతో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి.. ఎంతో అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకుని స్టార్ హీరోయిన్ గా తన హవా నడిపించిన సిమ్రాన్.. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైంది.  అప్పట్లో తెలుగు తమిళ కన్నడ ఇండస్ట్రీలలో సిమ్రాన్ కి  ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో అటు తమిళ కన్నడ ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోలందరి సరసన నటించింది సిమ్రాన్. 

 

 తన అట్రాక్టివ్ అందాలతో కుర్రకారుకి గుబులు పుట్టించిన ఈ ముద్దుగుమ్మ. తన లేలేత పరువాల తో 1990లలో ఉర్రూతలూగించింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఈ స్లిమ్ బ్యూటీ కోసం అప్పట్లో టాప్ హీరోలు సైతం తమ సినిమాల్లో కావాలని  పోటీపడేవారు.ఓ  వైపు మాత్రం డ్రెస్సులు వేస్తూ అదరగొడుతూనే మరోవైపు సాంప్రదాయమైన దుస్తుల్లో కూడా ఎంతో మందిని ఆకట్టుకుంది సిమ్రాన్. అప్పట్లో ఎన్నో ఛాన్సులను దక్కించుకుంది ఈ పంజాబీ ముద్దుగుమ్మ. దాదాపు 80కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. 

 


 ఇక ఆ తర్వాత సిమ్రాన్ తన చిన్ననాటి స్నేహితుడైన దీపక్ బగ్గ  ను పెళ్లి చేసుకుంది. వీరికి అదిప్  ఆదిత్ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. పెళ్లి తర్వాత హీరోయిన్ పాత్రలకు పూర్తిగా దూరమైపోయిన హీరోయిన్ సిమ్రాన్... ఆ తర్వాత పలు టీవీ షోలలో కూడా వ్యాఖ్యాతగా మెరిసింది. ఆ తర్వాత 2015 లో తన భర్త తో కలిసి ఒక ప్రొడక్షన్ హౌస్ ను కూడా స్థాపించింది. ఇక ఒకప్పుడు హీరోయిన్గా ఎంతగానో అలరించిన సిమ్రాన్  తర్వాత పలు వాణిజ్యపరమైన అడ్వర్టైజ్మెంట్ లో కూడా నటించింది. కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి: