ఓటీటీ లో సినిమాలు విడుదల చేయడమా...? చేస్తే నష్టమే గాని లాభం ఏమైనా వస్తుందా...? ఒక సినిమా అంటే విడుదల చేయవచ్చు రెండు సినిమాలు అంటే విడుదల చేయవచ్చు గాని అన్ని సినిమాలు అందులోనే విడుదల చేస్తే రేపు థియేటర్ కి ఎవరైనా వస్తారా...? వస్తారో మానేస్తారో గాని ఇప్పుడు మాత్రం ఓటీటీ అంటే జనాలు చాలా భయపడుతున్నారు. కరోనా దెబ్బకు సినీ పరిశ్రమ మొత్తం కూడా ఇప్పుడు పైకి నవ్వలేక లోపల ఏడవలేక బాధ పడుతుంది. కరోనా తీవ్రత మాములుగా ఉండదు. 

 

కరోనా వైరస్ ని ఎదుర్కోవడం కూడా చాలా కష్టం అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోజు రోజుకి కేసులు పెరుగుతూ పోతున్నాయి. మరి సినిమాల పరిస్థితి ఏంటీ...? సినిమాల కష్టాలను ఎవరు వింటారు...? ఇక అందుకే లాభం ఎంతో కొంత అని  ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఇక తమిళ స్టార్ హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించిన సినిమాలు ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఓటీటీ లో వచ్చేస్తున్నాయి. ఆమె నటించిన పెంగ్విన్ చిత్రం ఓటీటీ లో విడుదల అయింది. దీనికి మంచి స్పందన వస్తుంది. 

 

ఇక ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ లో విడుదలకు సిద్దం చేస్తుంది కీర్తి సురేష్. అవును ఆమె నటించిన మిస్ ఇండియా సినిమా ఓటీటీ లో విడుదల చేయడానికి గానూ చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి మరి. ఇప్పటికే ఓటీటీ లో విడుదల చేయడానికి గానూ చిత్ర యూనిట్ ప్రయత్నాలు మొదలు పెట్టింది. అమెజాన్ ప్రైమ్ తో చర్చలు జరుపుతున్నారు. ఇక మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టంగా తెలియడం లేదు గాని త్వరలోనే వచ్చేస్తుంది అని టాక్. ఇది ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: