బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోయిన తర్వాత హాలీవుడ్ మీద దృష్టి పెట్టింది ప్రియాంక చోప్రా. ఆమెకు అక్కడ మంచి ఆఫర్లు వచ్చిన నేపధ్యంలో హింది లో ఆమె సినిమాలను చాలా తక్కువగా చేస్తూ వస్తుంది. ఇక ఆఫర్లు వచ్చినా సరే చాలా వరకు జాగ్రత్తగానే ఆమె సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తుంది. స్టార్ హీరోలు అయినా చిన్న హీరోలు అయినా సరే ఆమె చాలా సార్లు ఆలోచించి హాలీవుడ్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే సినిమాలు చేస్తుంది అని చెప్పాలి. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

 

ఆమెకు గతంలో బాలీవుడ్ లో మంచి ఆఫర్లు వచ్చాయి. ఆ ఆఫర్లను ఆమె దృష్టి లో పెట్టుకోకుండా హాలీవుడ్ లో ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసి ఇక్కడి సినిమాలను వదిలి పెట్టింది. అయితే ఇప్పుడు ఆమెను హాలీవుడ్ కూడా పక్కన పెడుతుంది అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. అవును ఆమె అక్కడ సినిమాలు చేయడం తో ఇక్కడ ఒకప్పుడు కొందరిని చిన్న చూపు చూసిన నేపధ్యంలో ఇక ఆమెను పక్కన పెట్టాలి అనే నిర్ణయానికి బాలీవుడ్ లో వచ్చారు. ఇటీవల సల్మాన్ సినిమాలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని భావించారు. కాని ఆమె వ్యవహార శైలి కారణంగా ఆమెను పక్కన పెట్టారు. 

 

ఇక ఇప్పుడు ఆమె రెండు సినిమాలను బాలీవుడ్ లో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా సరే అవకాశం మాత్రం రావడం లేదు అని సమాచారం. ఇక హాలీవుడ్ లో కూడా పక్కన పెట్టడం తో ఇక ఇప్పుడు ఎం చెయ్యాలో అర్ధం కాని పరిస్థితికి ఆమె వచ్చారు అని తెలుస్తుంది. చూడాలి మరి ఎం జరుగుతుందో... కాగా ఆమె ఎక్కువగా అమెరికాలోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: