టాలీవుడ్ లో ఇప్పుడు కీర్తి సురేష్ కి మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి హోదా తెచ్చుకున్న ఆమె ఏ విధంగా సినిమాలో నటిస్తా అన్నా సరే ఆమెను తీసుకునే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు ఎదురు చూసే పరిస్థితి ఉంది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. ఇక  ఇప్పుడు ఆమె మన తెలుగులో వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఏ మాత్రం కూడా సినిమాల విషయంలో ఆమె వెనక్కు తగ్గడం లేదు. 

 

తనకు ఉన్న డిమాండ్ ని ఆమె వాడుకునే ప్రయత్నం చేస్తుంది. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చాలా కీలకంగా మారింది అనే చెప్పాలి. ఇప్పుడు మహేష్ బాబు ఆమె తో సినిమా చేయడానికి గానూ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నాడు అనే ప్రచారం సోషల్ మీడియాలో టాలీవుడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా తెలుగు మీద ఫోకస్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలోనే అగ్ర హీరోలతో సినిమాలు చేయడానికి గానూ ఆమె ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఎటు చూసినా సరే పూజ హెగ్డే రష్మిక మాత్రమే కనపడుతున్నారు. 

 

ఇప్పుడు వాళ్ళను పక్కన పెట్టి ఆమె సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది. టాప్ చైర్ కోసం ఆమె ప్రయత్నాలు చేస్తుంది అని అంటున్నారు. అగ్ర హీరోలతో సినిమాలు చేయడం ద్వారా తన మార్క్ వేసుకునే విధంగా ఆమె అడుగులు వేస్తుంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అటు తమిళం లో కూడా స్టార్ దర్శక నిర్మాతలు ఆమె కోసం కోసం ఎదురు చూస్తున్నారు. మరి తెలుగులో ఆమె టాప్ హీరోయిన్ అవుతుందా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: