టాలీవుడ్ లో ఇప్పుడు యువ హీరోలకు కెరీర్ మీద చాలా భయం ఉన్న సంగతి తెలిసిందే. కెరీర్ లో ఇప్పుడు వారు నిలబడలేదు అంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంది అని చాలా మంది అంటున్నారు. కెరీర్ కి ఇది చాలా కీలకమని భావిస్తున్నారు. అందుకే యువ హీరోలు అందరూ కూడా ఇప్పుడు భారీగా కష్టపడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి ఇప్పుడు. అవును యువ హీరోలు అందరూ కూడా ఇప్పుడు భారీగా వర్కౌత్స్ చేస్తున్నారు అని తెలుస్తుంది. చిన్న హీరో లు అందరూ కూడా బాడీ బిల్డింగ్ మీద బాగా దృష్టి పెట్టారట. 

 

కార్తికేయ, నిఖిల్, నితిన్ అలాగే నానీ అందరూ కూడా బాడీ బిల్డింగ్ మీద ఎక్కువగా ఫోకస్ చేసారు అనే ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతుంది. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. అగ్ర హీరోల సినిమాలకు ఇప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని చిన్న హీరోలు ఇప్పుడు నిలబడలేదు అంటే మాత్రం పరిస్థితి వాళ్ళ భవిష్యత్తు ని దెబ్బ కొట్టే విధంగా ఉంది. అందుకే ఇప్పుడు రాబోయే రెండేళ్ళు ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి. ఇక నిఖిల్ ఇప్పుడు కార్తికేయ 2 కోసం కష్టపడుతున్నాడు. 

 

కార్తికేయ కూడా తన తర్వాతి సినిమా కోసం గానూ కష్టపడే పరిస్థితి ఏర్పడింది. రాం కూడా కండలు పెంచే పని లో పడ్డాడు అని అంటున్నారు. ఈ విధంగా ఇప్పుడు అందరూ కూడా భవిష్యత్తు మీద బెంగ తో కాస్త ఎక్కువగా కష్టపడుతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఎంత వరకు కష్టపదతారో... ఇక ఇప్పుడు యువ హీరోలకు తక్కువ బడ్జెట్ లో మంచి డిమాండ్ ఉంది అని టాలీవుడ్ లో టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: