ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సినిమాలను నిర్మించడం అనేది ఒక సవాల్ అనే విషయం అందరికి తెలిసిందే. ఏ సినిమా చెయ్యాలి అనుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసే పరిస్థితి అయితే టాలీవుడ్ లో ఉంది అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే అదే విధంగా ఆలోచించి ఒకటికి పది సార్లు జాగ్రతలు తీసుకుని చేసే పరిస్థితి ఉంది అనేది వాస్తవం. ఇక ఇప్పుడు కొందరు అగ్ర నిర్మాతలు ఈ పరిస్థితిలో సినిమాలు వద్దు అనే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ వినపడుతుంది. అవును ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల విషయంలో అయినా చిన్న హీరోల సినిమాల విషయంలో అయినా సరే వాళ్ళు వెనక్కు తగ్గుతున్నారట. 

 

గతంలో భారీ ప్రాజెక్ట్ లు చేసే ఆలోచనలో ఉన్న నిర్మాతలు అందరూ కూడా ఇప్పుడు భయపడి వెనకడుగు వేసే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. అందుకే ఇప్పుడు చిన్న హీరోలను పూర్తిగా పక్కన పెడతారు అనుకున్నారు. కాని అగ్ర హీరోలను కూడా పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నారు అనే టాక్ ఎక్కువగా వినపడుతుంది. మరి ఇప్పుడు సినిమాలను నిర్మాతలు నిర్మిస్తారా లేక కొన్నాళ్ళు ఆగుతారా అనేది ఆసక్తికరంగా మారింది, దిల్ రాజు అయితే ఇప్పుడు అసలు ఏ సినిమా వద్దు అనే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. 

 

అవును ఇప్పుడు అసలు సినిమాలను చేస్తే నష్టపోవడమే మినహాఅసలు లాభాలు అనేది వచ్చే అవకాశం లేదు అని భావిస్తున్నారట. అల్లు అరవింద్ మాత్రం కాస్త దూకుడుగా చేస్తున్నారట. దానయ్య విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మినహా ఏ సినిమాలో పెట్టుబడి వద్దు అనే ఆలోచనలో ఆయన ఉన్నారు అని సమాచారం. మరి టాలీవుడ్ లో నిర్మాతలకు ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అనేది చూడాలి. 
.

మరింత సమాచారం తెలుసుకోండి: