బాలీవుడ్ లో సుశాంత్ సింగ్ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. సుశాంత్ మరణించడం పై ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ కూడా స్టార్ హీరోల మీద విమర్శలు చేస్తున్నారు. అతను వారిని ఎదుర్కొని నిలబడలేదు అని అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు అని పలువురు వాపోతున్నారు. ఇక దీనిపై ఇప్పుడు అగ్ర హీరోలు అందరిని కూడా దోషులు మాదిరిగా చూస్తున్నారు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా. సల్మాన్ ఖాన్ విషయంలో ఇప్పుడు బాలీవుడ్ లో చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. ఎవరు అయినా సరే తన కిందనే ఉండాలి అనే విధంగా అతను ఆలోచిస్తాడు అని అంటున్నారు. 

 

ఇక అతనికి తోడు గా కరణ్ జోహార్ కూడా టాలీవుడ్ లో ఇలాంటి పరిణామాలకు కేంద్ర బిందువు అనే విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. అతని వలన బాలీవుడ్ లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అని ప్రతీ ఒక్కరిని కూడా అతను ఏదోక విధంగా వేధిస్తున్నాడు అంటూ విమర్శలు అయితే వాస్తున్నాయి. ఇక అతనిని బాలీవుడ్ నుంచి పంపిస్తే మంచిది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అతని మీద కేసులు పెట్టడానికి చాలా మంది రెడీ అయ్యారు అని అంటున్నారు. 

 

అతను చెప్పిన విధంగా సినిమాలు చెయ్యాలి అని లేకపోతే ఇక బాలీవుడ్ లో ఉండటం అనేది చాలా కష్టం అని అక్కడ చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు అతనిని బాలీవుడ్ నుంచి తరిమి కొట్టాలి అని అతను ఇప్పుడు ఇతర భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నాడు అతనిని అసలు ఏ భాషలో కూడా ఉంచవద్దు అని అంటున్నారు. అతను బాలీవుడ్ కి శాపం మాదిరి అయ్యాడు అని అతనిని పక్కన పెట్టడమే బెస్ట్ అని సూచిస్తున్నారు. తెలుగులో అతను ఒక సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: