అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ దేవరకొండసినిమా చేసినా సరే జనాలకు ఒక రేంజ్ లో ఆసక్తి ఉంటుంది. విజయ్ సినిమాల మీద జనాలకు ఒక క్రేజ్ అనేది తెలియకుండా వచ్చింది. విజయ్ ఇప్పుడు టాలీవుడ్ లో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో అనే విషయం అందరికి తెలిసిందే. అతను సినిమాల్లో వైవిధ్యం చూపించే విధంగా నటిస్తూ ఉంటాడు. అతని సినిమాలు చూసిన ఎవరికి అయినా సరే ఇదే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇప్పుడు అతను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది. 

 

ఇక ఈ సినిమా తర్వాత అతను తమిళం లో ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అతనికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది అని అది గ్రహించిన హీరోలు అతని తో తమిళం లో సినిమాలు చేస్తే బాగుంటుంది అనే భావన లో ఉన్నారు అని అంటున్నారు. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. సూర్య ఇప్పటికే అతనిని అడిగాడు అని కూడా సమాచారం. దీనికి విజయ్ కూడా ఓకే చెప్పాడు అని తెలుస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న పరిస్థితి చూస్తే విజయ్ సినిమాలకు కాస్త ప్రేక్షకుల నుంచి స్పందన గతంలో మాదిరిగా ఉండేలా లేదు. 

 

విజయ ఏముంది గాని  ఇతర హీరోల పరిస్థితి కూడా దాదాపుగా అదే విధంగా ఉంది అనే చెప్పాలి. అందుకే ఇప్పుడు విజయ్ కూడా కాస్త జాగ్రత్త పడుతున్నాడు. ఈ తరుణం,లో తమిళంలో కి వెళ్తే నష్టం వచ్చే అవకాశం ఉంది అని తెలుగు లోనే సినిమాలు చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నట్టు టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. ఇప్పుడు విజయ్ చేస్తున్న సినిమాలో బాక్సర్ గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: