టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారి ఇంటికి కోడలు అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రాణిస్తోంది సమంత. గత ఏడాది తన భర్త నాగ చైతన్య తో కలసి మజిలీ సినిమాలో నటించి అదిరిపోయే విజయం సాధించింది. అంతేకాకుండా సూపర్ డీలక్స్ , ఓ బేబీ సినిమాలు కూడా చేసి బాక్సాఫీస్ దగ్గర పెళ్లయిన తర్వాత కూడా తన సత్తా చాటింది. ఈ ఏడాది తమిళంలో వచ్చిన జాను సినిమా తెలుగులో రీమేక్ చేయడం జరిగింది. ‘జాను’ సినిమా పెద్ద విజయం సాధించకపోయినా పరవాలేదనిపించింది. ఇదిలా ఉండగా ఒకపక్క సినిమాలు చేస్తూనే మరో పక్క వెబ్ సిరీస్ లో కూడా యాక్ట్ చేయడానికి ఇటీవల సమంత రెడీ అయింది. ఈ నేపథ్యంలో  'ది ఫ్యామిలీ మ్యాన్' సిరీస్ కి కొనసాగింపుగా వస్తున్న సీజన్ 2 లో సమంత కీలక నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారని సమాచారం.

 

తన పాత్రకు సంబంధించి ఈ వెబ్ సిరీస్ లో సమంతా షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుందట. త్వరలోనే ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. అంతేకాకుండా త్వరలో తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోంది. అయితే తెలుగులో మాత్రం మరో సినిమా ప్రకటించలేదు. ఇదిలా ఉండగా సమంత తన కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా ప్రాజెక్ట్ ఇటీవల ఓకే చేసినట్లు వార్తలు అందుతున్నాయి.

 

పూర్తి విషయంలోకి వెళ్తే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ వారితో లేడీ ఓరియెంటెడ్ సినిమాకి సంబంధించి స్టోరీని,  పాన్ ఇండియా తరహాలో సినిమా చేయడానికి సమంత డీల్ సెట్ చేసుకున్నట్లు టాక్. అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలయి...ఈ సంవత్సరం చివరాఖరున రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కరోనా కంట్రోల్ అయ్యాక పరిస్థితులు చక్కబడ్డాక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. సో ఇప్పటి వరకు సౌత్ ఇండియా కి పరిమితమైన సమంత ఈ సినిమాతో త్వరలో బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటడానికి రెడీ అయినట్లు అర్థమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: