టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మల్టి స్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. రౌద్రం రణం రుధిరం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రామ్ చరణ్ ఫస్ట్ లుక్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ ని సృష్టించింది. ఇక గత కొన్నాళ్లుగా మిగతా దేశాలతో పాటు మన దేశంలో కూడా కరోనా వ్యాధి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో అన్ని సినిమా షూటింగ్స్ తో పాటు ఆర్ఆర్ఆర్ షూట్ కూడా వాయిదా పడింది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=RRR MOVIE' target='_blank' title='rrr-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>rrr</a> to be the first film to resume shooting post ...

ఇటీవల షూటింగ్స్ కు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పర్మిషన్ ఇవ్వడంతో ఆర్ఆర్ఆర్ టీమ్ కూడా అతి త్వరలో తమ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని కూడా ప్రారంభించేలా ప్లాన్స్ చేస్తోంది. వాస్తవానికి ఈ ఏడాది జులై 30న రిలీజ్ కావలసిన ఈ సినిమాని గ్రాఫిక్స్, సిజి వర్క్ ఆలస్యం కారణంగా వచ్చే ఏడాది జనవరి 8కి వాయిదా వేయగా, ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్నాళ్ళు షూటింగ్ వాయిదా పడడంతో, సినిమా రిలీజ్ కూడా మరొక్కసారి వాయిదా పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇకపోతే సినిమా రిలీజ్ వాయిదా పడ్డప్పటికీ కూడా ప్రస్తుతం ఈ మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తో ఒకప్పటి వలె ప్రేక్షకులు సినిమా చూసేందుకు ఎంతవరకు థియేటర్స్ కు వస్తారు అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. మరోవైపు ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో సీటింగ్ మార్పు చేయగా, మరికొన్ని థియేటర్స్ మాత్రం ఒక సీట్ ని విడిచిపెట్టి మరొక సీట్ ని ప్రేక్షకులకు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాబోయే రెండు నెలల్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అవుతాయని కూడా సమాచారం అందుతోంది. 

 

అయితే గతంలో రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలైన బాహుబలి రెండు భాగాలూ కూడా ఎంతో గొప్ప విజయం అందుకుని అత్యధిక స్థాయిలో వందల కోట్ల కలెక్షన్ ని ఆర్జించడం జరిగింది. మరి ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ రాబోయే రోజుల్లో షూటిగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అయితే, ఒకప్పటివలె ఎంతవరకు ప్రేక్షకుడిని థియేటర్ కు రప్పించగలదు, అలానే ఎంతమేర భారీ స్థాయిలో కలెక్షన్ సంపాదించగలదు అనే అనుమానాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో ఆర్ఆర్ఆర్ మూవీ, బాహుబలి కలెక్షన్ ని దాటడం కష్టం అని అంటున్న వారు కూడా లేకపోలేదు. ఈ విధంగా ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్, ఆ సినిమా భారీ కలెక్షన్స్ విషయమై ఆశలు వదులుకోవడం బెటర్ అనే వాదన కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయమై ఏమి జరుగుతుందో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: