రామ్ చరణ్ సినిమాలు అనగానే ఈ మధ్య జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. ధ్రువ సినిమా తర్వాత అతను చేసిన రంగస్థలం సినిమా నుంచి కూడా ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. రంగస్థలం సినిమాలో అతను చాలా కొత్తగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన వినయ విదేయ రామ సినిమా విషయంలో కూడా  అతని మీద చాలా అంచనాలు వచ్చాయి గాని సినిమా మాత్రం ఆశించిన స్తాయిలో విజయం సాధించలేదు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత అతను ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. 

 

ఇక తండ్రి సినిమాలకు నిర్మాతగా కూడా రామ్ చరణ్ వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతని సినిమాల మీద జనాలకు ఒక ఆసక్తి తో పాటుగా ... ఏ సినిమా చేస్తున్నాడు అనేది కూడా ఉంది. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన తర్వాతే మరో సినిమా చేసే అవకాశం ఉంది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత అతను ఒక బాలీవుడ్ సినిమాను రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు అని సమాచారం. సుశాంత్ సింగ్ చివరి సినిమా చిచోరే ని రీమేక్ చేసే ఆలోచనలో అతను ఉన్నాడు అని తెలుస్తుంది. 

 

వరుణ్ తేజ్ తో ఈ సినిమాను చెయ్యాలి అని భావిస్తున్నట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా హక్కులకు సంబంధించి అతను బోనీ కపూర్ ద్వారా చర్చలు జరుపుతున్నారు అని సమాచారం. చూడాలి మరి ఎప్పుడు ఈ సినిమా వస్తుంది అనేది. ఆర్ఆర్ఆర్ వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: