సినిమాల్లో నెవర్ బోరింగ్ సబ్జెక్ట్ అంటూ ఏమన్నా ఉంటే అవి ప్రేమకథలే. వీటిని బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచీ ఇప్పటి వరకూ ఎన్నో రకాలుగా, ఎన్నో డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో తెరకెక్కించారు దర్శకులు. ఇప్పుడు మరో ప్రేమకథ తెలుగు తెరపై వచ్చేందుకు సిద్ధమైంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వస్తున్న ఆ సినిమానే ‘కృష్ణ అండ్ హిజ్ లీల’. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ తో సినిమాపై బజ్ క్రియేట్ అయింది. ఇప్పుడు మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

IHG

బేస్డ్ ఆన్ ట్రూ రూమర్స్ అంటూ సినిమాలో మంచి లవ్ సబ్జెక్ట్ ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. కృష్ణ-సత్య క్యారెక్టర్లను అందంగా చూపించారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రద్ధా శ్రీనాధ్ జంట చక్కగా ఉన్నారు. వీరిద్దరి మధ్య రోమాన్స్, క్లాష్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. చూస్తుంటే ఓ ఫ్రెష్ లవ్ సబ్జెక్ట్ అనిపిస్తోంది. ముఖ్యంగా శ్రద్ధ శ్రీనాధ్ గ్లామరస్ గా ఉంది. సిద్ధు లవర్ బాయ్ గా ఆకట్టుకుంటున్నాడు. టైటిల్, ఫస్ట్ లుక్ తోనే క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా ట్రైలర్ తో ఆకట్టుకుందనే చెప్పాలి. రానా దగ్గుబాటి నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.

IHG

అడివి శేష్ తో ‘క్షణం’ వంటి సస్పెన్స్ థ్రిల్లర్ తో సక్సెస్ దక్కించుకున్న రవికాంత్ పేరేపు ఈ రొమాంటిక్ సినిమాకు దర్శకత్వం వహించాడు. సినిమా కథను రవికాంత్, సిద్ధు సమకూర్చారు. శ్రద్ధాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు సీరత్ కపూర్, షాలినీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాను ఓటీటీలోనే రిలీజ్ చేస్తామని రానా చెప్పిన విషయం తెలిసిందే. డిజిటల్ ప్లాట్ ఫామ్ ను, రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫిషియల్ గా రివీల్ చేయాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: