సమకాలీన రాజకీయాలపై ఎప్పటికప్పుడు సినిమాలు వస్తూనే ఉంటాయి. దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో నటించి తెరకెక్కించిన ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ సినిమా ఆ కోవలోకే వస్తుంది. 1983లో వచ్చిన ఆ సినిమా అప్పట్లో హిట్ అయింది. ఈ సినిమాలో దాసరి నారాయణరావు క్షౌర వృత్తి చేస్తూంటాడు. ఆ ఊళ్లో ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పదవికి ఇద్దరు పోటీ పడతారు. అయితే.. సయోధ్య కుదరక మధ్యే మార్గంగా ఓ నమ్మకమైన వ్యక్తిని నిలబెట్టాలని తీర్మానిస్తారు. ఊళ్లో అందరికీ పరిచయస్తుడైన దాసరిని ఎమ్మెల్యే పదవికి నిలబెడతారు.

IHG

 

దాసరి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. ఇక్క అక్కడి నుంచి కథ మొత్తం నేటి సమకాలీన రాజకీయాలను తలపిస్తాయి. ఆ మధ్య కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రానప్పుడు తక్కువ సీట్లు నెగ్గిన జనతాదళ్ పార్టీకి అధికారం అప్పగించి కుమారస్వామిని సీఎం చేశారు. అదే స్ట్రాటజీని అప్పట్లోనే దాసరి ఈ సినిమాలో కథగా తీసుకున్నారు. ఇప్పటి కుమారస్వామిలా ఆ సినిమాలో దాసరి రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు. సీఎం అయ్యాక అతిముఖ్యంగా ఇదే కర్ణాటక రాజకీయాల్లో కుమారస్వామిని ఎలా పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చిందో అదే తరహాలో కథ సాగుతుంది. దాసరిని పదవీచ్యుతుడిని చేయాలని మిగిలిన పార్టీలు కలిసిపోతాయి. కానీ.. దాసరి తన మంత్రాంగం ఉపయోగించి సీఎంగా కొనసాగుతారు.

IHG

 

సీఎంగా అన్ని శాఖలు తన వద్దే ఉంచుకుని.. ప్రతి పనికి ఎంత లంచం తీసుకుని అనుమతులు ఇచ్చేస్తూంటాడు. క్లైమాక్స్ లో లంచాలు తీసుకున్నాడని దాసరిని నిందించిన సమయంలో మీరు లంచాలు ఎలా ఇచ్చి మోసపోతున్నారో చెప్పడానికే అలా చేశానని ఆ డబ్బంతా ప్రజల కోసం ఫండ్ ఏర్పాటు చేసానని చెప్తాడు. ఆ సినిమా అప్పట్లో ప్రజాదరణ పొందింది. సమకాలీన రాజకీయాలపై, వ్యవస్థపై దాసరి సంధించిన అస్త్రంగా ఆనాడే ఎమ్మెల్యే ఏడుకొండలు నిలిచిపోయింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: