ఇండియా చైనా బోర్డర్ కు సంబంధించి లడక్ ప్రాంతంలోని గల్వాన్ వ్యాలీ లో జరిగిన సంఘటనలో చైనా సైనికుల దురాగతం వల్ల మన భారతదేశానికి సంబంధించి 20 మంది సైనికులు మరణించడంతో ఆ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఇంకా యావత్తు భారత జాతి చైనా పై పగతో రైగిలి పోతోంది. ఇలాంటి పరిస్థితులలో ‘బాయ్ కాట్ చైనా’ అంటూ చైనా వస్తువులకు వ్యతిరేకంగా ఒక సామాజిక ఉద్యమం ఊపందుకుంది.


1920 ప్రాంతంలో మహాత్మాగాంధీ అలనాటి బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా చేపట్టిన విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమ స్పూర్తిని గుర్తుకు చేసేలా ఇప్పుడు రోజురోజుకు బలం పుంజుకుంటున్న స్వదేశీ మంత్ర ‘బాయ్ కాట్ చైనా’ సామాజిక ఉద్యమం బలం పుంజుకుంటున్న నేపధ్యంలో ఈ ఉద్యమానికి సహకరించ వలసిందిగా సినిమా సెలెబ్రెటీల పై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే చాలామంది ఎంతో మోజు పడి తమ సెల్ ఫోన్స్ లో ఇన్ స్టాల్ చేసుకున్న టిక్ టాక్ యాప్ ను అన్ ఇన్ స్టాల్ చేసుకుంటూ ఈ విషయం పై సహకరించవలసిందిగా సెలెబ్రెటీలను కూడ కోరుతున్నారు.


అంతేకాదు స్వదేశీ వస్తువులను మాత్రమే వినియోగించండి విదేశీ వస్తువులు మనకు వద్దు అంటూ జరుగుతున్న సామాజిక పోరాటానికి మద్దతు ఇవ్వవలసిందిగా సెలెబ్రెటీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితులలో మన సినిమా సెలెబ్రెటీలు ఏమి చేస్తారు అన్న విషయం పై ఆసక్తి పెరుగుతోంది. వాస్తవానికి మన సెలిబ్రిటీలు చాలామంది వాడే సబ్బులు పెర్ఫ్యూమ్స్ నుండి లక్షలలో విలువ చేసే ఐఫోన్స్ వరకు పేరుకు అవి అమెరికా కంపెనీ వస్తువులే అయినా ఆ వస్తువులను చైనాలో తయారు చేస్తారు.


ప్రస్తుతం చైనా ఒక మ్యాన్ ఫ్యాక్చరింగ్ హబ్ గా మారడంతో అనేక ప్రముఖ కంపెనీల వస్తువులు అన్నీ మనకు చైనా నుండి మాత్రమే దిగుమతి అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఇంత ఖరీదైన వస్తువులను వాడుతూ విలాసవంతమైన జీవితం గడుపుతున్న మన సెలెబ్రెటీలు ‘బాయ్ కాట్ చైనా’ సామాజిక ఉద్యమానికి మద్దతు తెలిపి తమ అలవాట్లను మార్చుకుని అందరికీ ఆదర్శంగా నిలబడగలరా లేదా అన్నవిషయమై వారి పై ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఈ స్వదేశీ మంత్ర మన సెలెబ్రెటీ లపై కరోనా కంటే ఎక్కువ టెన్షన్ పెడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: