బాహుబలి సినిమా ద్వారా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన దర్శక ధీరుడు రాజమౌళి తమ్న తర్వాతి చిత్రంగా ఆర్.ఆర్.ఆర్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచానాలు భారీగా ఏర్పడ్డాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ లుక్ అదిరిపోయింది.

 

అయితే రామ్ చరణ్ లుక్ రిలీజ్ చేసినప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న ఆసక్తి మరింత ఎక్కువైంది. మరికొన్ని రోజుల్లో ఎన్టీఆర్ లుక్ విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా బ్రిటన్ భామ ఒలివియా మోరిస్ చేస్తుండగా, రామ్ చరణ్ సరసన సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కనిపించనుంది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆలియా భట్ స్థానంలో మరొకరిని తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

 

ఆలియా భట్ ఇప్పటికే రెండు సార్లు డేట్లు ఇచ్చింది. కానీ కరోనా కారణంగా ఆమె ఇచ్చిన డేట్లలో షూటింగ్ కి వీలు కాలేదు. ఇప్పటి వరకూ ఆలియా పార్ట్ షూటింగ్ స్టార్ట్ కూడా కాలేదు. తెలుగు రాష్ట్రాల్లో షూటింగ్ కి అనుమతులు లభించిన నేపథ్యంలో రాజమౌళి షూటింగుకి రెడీ అవ్వాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఆలియా భట్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల ఆర్.ఆర్.ఆర్ కి డేట్లు ఇవ్వలేకపోతుందట.

 

దాంతో రాజమౌళి షూటింగ్ స్టార్ట్ అయ్యే లోపు ఆలియా స్థానంలో మరో హీరోయిన్ ని వెతుకుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ విషయమై మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రస్తుతం రాజమౌళి గండిపేటలో టెస్ట్ షూట్ కి సిద్ధం అవుతున్నాడు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: