రజనీ కాంత్ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో నరసింహ ఒకటి. రజని కాంత్ ని కమర్షియల్ హీరో గా మార్చిన సినిమా ఇదే. ఈ సినిమా తర్వాత రజని కాంత్ రేంజ్ ఒక రేంజ్ లో పెరిగింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత రజని కాంత్ కి వచ్చిన డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇక ఈ సినిమాలో లేడీ విలన్ గా నటించిన రమ్యకృష్ణ నటన గురించి కూడా ఎంత చెప్పినా సరే తక్కువే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఆమె మినహా ఎవరు నటించిన అసారే సినిమాకు ఒక రేంజ్ రాదు అని అంటారు సినిమా చూసిన వాళ్ళు. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో రాజకీయ కోణం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రజని కాంత్ అన్నగా నటించిన నాజర్ అదే విధంగా తండ్రి గా నటించిన వ్యక్తి కూడా రాజకీయ నాయకులే. ఆ బలం తోనే రజని కాంత్ ని ఇబ్బంది పెట్టాలి అని భావిస్తూ ఉంటారు. ఆ బలం తోనే రజని కాంత్ ని ఎదుర్కొని ఆయన కుమార్తె ను మోసం చేసి రమ్య అన్న కొడుకుని మరొకరికి ఇవ్వాలి అని భావిస్తూ ఉంటారు. ఆయన మంత్రి గా అది కూడా హోం మంత్రి గా నటిస్తారు ఈ సినిమాలో. ఆ సీన్ లు కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. 

 

ఇక ఈ సినిమా తర్వాత రజనీ కాంత్ కెరీర్ లో చాలా వరకు కమర్షియల్ సినిమాలే వచ్చాయి అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా సాధించిన విజయం  చూసి ఇతర హీరోలు కూడా షాక్ అయ్యారు అంటే అది ఏ రేంజ్ లో విజయం సాధించింది అనేది అర్ధం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: