మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో శ్రీమంతుడు ఒకటి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఫుల్ గా కమర్షియల్ హీరో గా మారిపోయాడు అనే చెప్పాలి. ఇక అక్కడి నుంచి ఏది చేసినా సరే కమర్షియల్ గానే అతను చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే రాజకీయ కోణం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఈ సినిమాలో మహేష్ బాబు ఒక బలమైన మంత్రి తో పోరాటం చేస్తూ ఉంటాడు. అతనికి కేంద్రం లో కూడా బలం ఉంటుంది. ఇక రాష్ట్రం లో అతని తమ్ముడు కూడా ఒక తిరుగులేని శక్తి గా ఉంటాడు. 

 

ఇలా సినిమాలో రాజకీయ కోణం బాగానే చూపించారు. అలాగే ప్రతీ సీన్ లో కూడా రాజకీయ కోణం మహేష్ బాబు గ్రామంలోకి అడుగు పెట్టిన తర్వాత కనపడుతూ ఉంటుంది. దానికి మంచి స్పందన వచ్చింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఇక కెరీర్ లో వెనక్కు తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా చేసిన మహేష్ ఆ తర్వాతి నుంచి తన ప్రతీ సినిమాలో కూడా కమర్షియల్ కోణం ఉండే విధంగా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అతను సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు. 

 

సినిమా మహేష్ కెరీర్ లో కొత్తగా ఉంటుంది అంటూ సినిమా ఇంకా విడుదల కాక ముందే కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా కరోనా కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు మరి. చూడాలి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది. ఇటీవలే ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: